Home Film News Adipurush Event Fight: ఆదిపురుష్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ మ‌ధ్య ఫైట్.. అంత పెద్ద గొడ‌వ‌కు కార‌ణం?
Film News

Adipurush Event Fight: ఆదిపురుష్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ మ‌ధ్య ఫైట్.. అంత పెద్ద గొడ‌వ‌కు కార‌ణం?

Adipurush Event Fight: టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం ఆదిపురుష్‌. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జూన్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి మేక‌ర్స్ భారీ ఎత్తున ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. తిరుప‌తి వేదిక‌గా ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌గా, వెంక‌టేశ్వ‌రుని స‌న్నిధిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ ఈవెంట్‌లో ప్ర‌భాస్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. అయితే భారీ జ‌న‌సందోహం మ‌ధ్య ఈ ఈవెంట్‌గా చాలా కూల్‌గా, కామ్‌గా ముగిసింద‌ని అంద‌రు భావిస్తున్న స‌మ‌యంలో ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొందరు ఫ్యాన్స్ గొడవపడ్డారనే వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల టాలీవుడ్ పంథా పూర్తిగా మారింది. ఒక‌రి సినిమాల‌ని మ‌రొక‌రు సపోర్ట్ చేసుకుంటూ ప్ర‌మోట్ చేస్తున్నారు కూడా. బాహాటంగానూ ఇత‌ర హీరోల గురించి గొప్ప‌గా మాట్లాడుతున్నారు. అలానే క‌లిసి భారీ బడ్జెట్ సినిమాల‌ను చేస్తున్నారు. హీరోల్లో వ‌చ్చిన మార్పుకి బాలీవుడ్ సైతం షాక్ అవుతుంది. అయితే హీరోలో వ‌చ్చిన మార్పు  మాత్రం ఇంకా  ఫ్యాన్స్‌లో రాలేదు. మా హీరో అంటే మా హీరో గొప్ప అని  తిట్టుకోవ‌డం, కొట్టుకోవ‌డం చేస్తున్నారు.  మంగ‌ళ‌వారం సాయంత్రం తిరుప‌తిలో ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  ఇద్ద‌రు స్టార్ హీరోల ఫ్యాన్స్  మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

అందుకు  సంబంధించిన వీడియో కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్న ఈవెంట్‌లో మరో అభిమాని   ఏం మాట్లాడాడు.. ఎందుకు మాట్లాడాడు అనేది తెలియ‌టం లేదు కానీ.. ఇద్దరు ముగ్గురు అభిమానులు అత‌నిపై దాడి చేయ‌గా, ఇప్పుడు ఆ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతంది. నెట్టింట  మహేష్ బాబు ఫ్యాన్‌పై ప్ర‌భాస్ ఫ్యాన్స్  దాడి చేశారంటున్నారు. హీరోలు క‌లిసి స‌ర‌దాగా సంతోషంగా ఉంటున్నా కూడా అభిమానులు ఇంకెన్నాళ్లు ఇలా కొట్టుకొని చ‌స్తారు అని కొంద‌రు మండిప‌డుతున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...