Home Film News Mahesh: మ‌హేష్‌కి విల‌న్‌గా అమీర్ ఖాన్.. బాబోయ్ రాజ‌మౌళి స్కెచ్ మాములుగా లేదు..!
Film News

Mahesh: మ‌హేష్‌కి విల‌న్‌గా అమీర్ ఖాన్.. బాబోయ్ రాజ‌మౌళి స్కెచ్ మాములుగా లేదు..!

Mahesh: బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని రెండింత‌లు చేసిన ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆయ‌న ఇటీవ‌ల ట్రిపుల్ ఆర్ చిత్రంతో మ‌రో సెన్సేష‌న్ క్రియేట్ చేశాడు. ఈ చిత్రంకి ఆస్కార్ అవార్డ్ కూడా ద‌క్కింది. ఇక ఇప్పుడు ఉత్సాహంతో రాజ‌మౌళి.. మ‌హేష్ బాబు హీరోగా భారీ బ‌డ్జెట్ చిత్రం చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సాగ‌నున్న ఈ చిత్రంలో మ‌హేష్ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తారని టాక్.  ఇండియానా జోన్స్ ని ఈ చిత్రం పోలి ఉంటుందని అంటున్నారు. సినిమా కోసం అంతర్జాతీయ టెక్నీషియన్లు పనిచేయ‌నున్నారు. అంతేకాదు హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ కూడా ఇందులో భాగం కాబోతుందని తెలుస్తుంది..

రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్  ఈ చిత్రానికి క‌థ అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. వ‌చ్చే ఏడాది మూవీ షూటింగ్ మొద‌లు పెట్ట‌నున్నార‌ని అంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రూమ‌ర్స్ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా   కాస్టింగ్‌ కి సంబంధించిన వార్త  హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇందులో నటించబోతున్న యాక్టర్స్ గురించిన  రూమర్స్ వింటుంటే అభిమానుల‌కి పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయి.  మహేష్‌బాబుకి విలన్‌గా అమీర్‌ ఖాన్ ని తీసుకోవాల‌ని అందుకోసం మంత‌నాలు కూడా జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం.

ఇక మహేష్ స‌ర‌స‌న‌ దీపికా పదుకొనెని ఫైనల్‌ చేశారని టాక్.. ఇప్ప‌టికే ఈ అమ్మ‌డు ప్ర‌భాస్ స‌ర‌స‌న ప్రాజెక్ట్ కె చిత్రంలో న‌టిస్తుంది. ఈ మూవీతో తెలుగు ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించనుంది. మ‌హేష్ బాబు మూవీ కోసం కూడా దీపికా ప‌దుకొనేని ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్.   గ్లోబల్‌ ఇమేజ్‌ ఉన్న దీపికా పదుకొనె  చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తే మూవీకి మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్క‌డం ఖాయం. అయితే  ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వార్త మాత్రం మహేష్‌ఫ్యాన్స్ ఆనందం అవ‌ధులు దాటేలా చేస్తుంది. అయితే ఇందులో నిజానిజాలు తేలడానికి ఇంకా ఆరు నెలలైనా పడుతుంది. చిత్రంలో చాలా వ‌ర‌కు  మహేష్‌ పాత్రకి సీజీ వర్క్ ఉంటుందని, మహేష్‌ రిలాక్స్ అయిపోవచ్చని అంటున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...