Home Film News మెగాస్టార్ ముందు డ్యాన్స్ చేసేది ఎవరో గుర్తు పట్టారా? అత‌ను ఇప్పుడు పాన్ ఇండియా హీరో..!
Film News

మెగాస్టార్ ముందు డ్యాన్స్ చేసేది ఎవరో గుర్తు పట్టారా? అత‌ను ఇప్పుడు పాన్ ఇండియా హీరో..!

తెలుగులో డ్యాన్స్‌కి మెగాస్టార్ పెట్టింది పేరు. అప్పటి వరకు సాదాసీదా స్టెప్పులతో హీరోలు అలరించే వారు. అలాంటి పరిస్థితుల్లో చిరు డ్యాన్స్‌తో సెన్సేషన్‌గా మారారు. ముఖ్యంగా బ్రేక్ డ్యాన్స్‌తో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ సినిమాల్లో కష్టమైన స్టెప్పులను చాలా సులువుగా వేస్తుంటారు. అలాంటి మెగాస్టార్ ముందు ఓ చిన్నారి డ్యాన్స్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Chiranjeevi Konidela's Net Worth: From Luxurious Hyderabad Bungalow To A  Private Jet Worth Crores

ఆ బుడతడు ఎవరో కాదు. పాన్ ఇండియా స్టార్, ప్రేక్షకులు ముద్దుగా ఐకాన్ స్టార్ అని పిలుచుకునే అల్లు అర్జున్. గంగోత్రి సినిమా ద్వారా సినిమాల్లోకి ఆయన ప్రవేశించారు. ఆర్యతో ఎందరో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. దేశముదురు సినిమాతో మాస్ హీరోగానూ సత్తా చాటారు. ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. పుష్ప సినిమాలో ఆయన పలికిన డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజకీయ నేతలు, సెలబ్రెటీలు కూడా ఆయన డైలాగులకు ఫిదా అయిపోయారు.

మెగాస్టార్ మేనల్లుడిగా సినిమాల్లోకి వచ్చిన బన్నీ అనతి కాలంలోనే ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించాడు. ఆయన డ్యాన్స్‌‌కి ఎందరో ప్రేక్షకులు ఉన్నారు. ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడం ఆయన స్పెషాలిటీ. అదే పుష్ప సినిమాకు బాగా ప్లస్ అయింది. స్టైలిష్ స్టార్ గా పేరొందిన ఆయన పుష్ప సినిమాలో ఊరమాస్ లుక్ లో కనిపించారు. డీగ్లామరైజ్ గా కనిపించినా ప్రేక్షకులకు ఆయన పాత్ర ఎంతగానో నచ్చేసింది. శ్రీవల్లి పాటలో ఆయన సాదాసీదా స్టెప్పులు వేసినా, దేశమంతటా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయిపోయారు.

pushpa-2' సినిమాలో మెగాస్టార్ chiranjeevi .. హింట్ ఇచ్చిన డైరెక్టర్ ప్లాన్  అదిరిందిగా!

ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన కొన్ని డైలాగులు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను ఆగ‌స్టు15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పుష్ప‌1 బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, పుష్ప1 భారీ కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ తరుణంలో పుష్ప 2 ఎలాంటి రికార్డులు క్రియెట్ చేస్తుందో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...