Home Film News Vishal: పెళ్లి కాకుండా విశాల్‌కి 14 ఏళ్ల కొడుకు ఉన్నాడా.. ఇది తెలిసి అంద‌రు షాక్
Film News

Vishal: పెళ్లి కాకుండా విశాల్‌కి 14 ఏళ్ల కొడుకు ఉన్నాడా.. ఇది తెలిసి అంద‌రు షాక్

Vishal: త‌మిళ హీరో విశాల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌నకి తెలుగులోను ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విశాల్ ప్ర‌తి సినిమా కూడా తెలుగులో డ‌బ్ అవుతూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. విశాల్ త‌న సినిమాల కోసం ప్రాణం పెట్టి ప‌ని చేస్తూ ఉంటార‌నే విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్ప‌టికే ప‌లు చిత్ర షూటింగ్స్‌లో గాయ‌ప‌డ్డారు. షూటింగ్‌లో గాయ‌ప‌డ‌డం, కొద్ది రోజుల త‌ర్వాత తిరిగి కోలుకొని మ‌ళ్లీ షూటింగ్ చేయ‌డం విశాల్ స్పెషాలిటి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న విశాల్ 2019లో  తెలుగమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు.

వీరిద్ద‌రిది ఆర్నెళ్ల స్నేహం కాగా, ఇద్ద‌రు ఒకరినొక‌రు పూర్తిగా అర్థం చేసుకుని పెళ్లి చేసుకోవాని అనుకున్నారు. విశాల్ ఎంగేజ్మెంట్ తర్వాత అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఎట్టకేలకు మా హీరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ తెగ సంతోషించారు. కాని ప‌లు కార‌ణాల వ‌లన విశాల్ పెళ్లి ఆగిపోయింది.   తెలుగమ్మాయి అయిత‌న  అనీశా రెడ్డి..  ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లిచూపులు’ లాంటి సినిమాలలో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో న‌టించింది. అయితే విశాల్ తో బ్రేక‌ప్ త‌ర్వాత ఆమె మ‌రో పెళ్లి చేసుకున్నా కూడా విశాల్ మాత్రం సింగిల్‌గానే ఉన్నాడు. అయితే ఇప్ప‌టికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న విశాల్‌కి 14 ఏళ్ల కొడుకు ఉన్నాడ‌ట‌. ఈ విష‌యం విని అంద‌రు షాక‌వుతున్నారు.

పెళ్లి కాకుండా విశాల్‌కి 14 ఏళ్ల కొడుకు ఎక్క‌డ నుండి వ‌చ్చాడంటూ అందరు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే  విశాల్ కి 14 ఏళ్ల పెట్ డాగ్ ఉన్నాడట.  ఆగి అనే పెట్ డాగ్ ని విశాల్‌ తన సొంత కొడుకు లాగా చూసుకుంటాడట. ఇటీవ‌ల దానికి  14ఏళ్ల బర్త్ డేని కూడా తన తల్లిదండ్రుల సమక్షంలో చాలా గ్రాండ్ గా నిర్వహించారు విశాల్‌. ఆ పెట్ డాగ్‌ని విశాల్ చాలా గారాబంగా చూసుకుంటున్న నేప‌థ్యంలో విశాల్ కి 14 ఏళ్ల కొడుకు ఉన్నాడ‌ని ప‌లువురు చెప్పుకుంటున్నారు.  అయితే ఈ విష‌యం తెలిసి చాలా మంది న‌వ్వుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...