Home Film News Prabhas: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ను రిజెక్ట్ చేసిన ప్రభాస్..అవి చేసి ఉంటేనా?
Film News

Prabhas: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ను రిజెక్ట్ చేసిన ప్రభాస్..అవి చేసి ఉంటేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది. హీరోగా సినీ ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ 21 సినిమాలు చేశారు. వీటిల్లో హిట్స్ ఉన్నాయి.. ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రభాస్ తన సినీ కెరీర్ లో ఇప్పటికే చాలా సినిమాలు రిజెక్ట్ చేశారు. ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఏకంగా 8 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఈ మూవీస్ ఏంటో తెలిస్తే డార్లింగ్ ఫ్యాన్స్.. బాధపడటం గ్యారెంటీ. మరి ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్య. అల్లు అర్జున్ కు తన సినీ కెరీర్ ని టర్న్ చేసిన మూవీ. ఈ సినిమాను సుకుమార్ ఫస్ట్ ప్రభాస్ కి చెప్పాడట. అప్పటికే ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కొత్త డైరెక్టర్ సుకుమార్ కనుక కాస్త ఆలోచించి నో చెప్పాడు.

నెక్ట్స్ ఎన్టీఆర్ నటించి బృందావనం. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ప్లాన్ చేసిన ప్లామిలీ ఎంటర్ టైనర్. ఈ మూవీ స్టోరీని కూడా ప్రభాస్ కు చెప్పారు. అప్పటికే ప్రభాస్ డార్లింగ్ మూవీతో ఉండటం వల్ల రిజెక్ట్ చేశారు. నెక్ట్స్ ఒక్కడు. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ. ఈ సినిమా కథ కూడా ఫస్ట్ ప్రభాస్ దగ్గరకే వెళ్లింది. కానీ అప్పుడు కొన్ని కారణాలతో ప్రభాస్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. నెక్ట్స్ దిల్.. వివి వినాయక్ డైరెక్టర్ గా తీసిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ స్టోరీ ప్రభాస్ ఇమేజ్ కు కరెక్ట్ లేదని రిజెక్ట్ చేశారట. సింహాద్రి. రాజమౌళి, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన కమర్షియల్ సెన్సేషనల్ హిట్ మూవీ.

రాజమౌళి ఈ సినిమా కథను ఫస్ట్ బాలకృష్ణకు చెప్పారట. కానీ ఆయన రిజెక్ట్ చేశారు. నెక్ట్స్ ప్రభాస్ దగ్గరకు వెళ్తే ఆయన కూడా నో అన్నారట. అప్పుడు ఫైనల్ గా ఎన్టీఆర్ కు ఆ ఫేమ్ దక్కింది. కిక్.. సురేందర్ రెడ్డి డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమా కథను ఫస్ట్ ప్రభాస్ కు చెప్పగా.. అప్పుడు ఆయన డేట్స్ ఖాళీగా లేవని నో అన్నారట. డాన్ శీను. రవితేజ, గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన సినిమా. ఫస్ట్ ఈ స్టోరీని ప్రభాస్ కు చెప్పారు. కానీ అప్పుడు ఏదో కారణాలతో ఈ కథను వద్దని అన్నారట. ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...