Home Film News Sudheer-Rashmi: సుధీర్ గుండెల‌పై వాలిన ర‌ష్మీ.. ఇన్నాళ్ల‌కి మ‌ళ్లీ క‌లిసి కనిపించారు..!
Film News

Sudheer-Rashmi: సుధీర్ గుండెల‌పై వాలిన ర‌ష్మీ.. ఇన్నాళ్ల‌కి మ‌ళ్లీ క‌లిసి కనిపించారు..!

Sudheer-Rashmi: బుల్లితెర క్రేజీ క‌పుల్ సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. బుల్లితెర రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ పెయిర్ ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉంటారు. జబర్దస్త్ వేదికగా వీరిద్దరు చేసిన సంద‌డి మాములుగా లేదు. వీరిద్ద‌రి లవ్ ట్రాక్‌పై బోలెడన్ని స్కిట్స్ రావ‌డంతో రియ‌ల్ లైఫ్‌లో కూడా ఈ ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటే బాగుంటుంద‌ని చాలా మంది త‌మ అభిప్రాయాన్ని తెలియ‌జేశారు. సుధీర్- రష్మీ మధ్య జబర్దస్త్ లో మొదలైన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఢీ షో వరకు సాగింది. ఇక స్పెష‌ల్ ఎపిసోడ్స్‌లో రష్మీ సుధీర్ ప్రేమ సంగతులు హ‌ట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. వీరిద్ద‌రు క‌లిసి క‌నిపిస్తే ప్రేక్ష‌కుల‌లో కూడా తెలియ‌ని ఆనందం ఒక‌టి ఉంటుంది. ఒక‌ప్పుడు క‌లిసి క‌ట్టిగా సంద‌డి చేసిన వీరిద్ద‌రు ఇప్పుడు విడివిడిగా షోలు చేస్తున్నారు.

సుధీర్ ఒక‌వైపు హీరోగా కూడా సినిమాలు చేస్తుండ‌డంతో జ‌బ‌ర్ధ‌స్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల‌కి దూరంగా ఉంటున్నాడు. అయితే “ఈటీవీ 28 వసంతాల” సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా చేయ‌గా, ఈ ఈవెంట్‌లో సుధీర్ మెరిసాడు. తాజాగా విడుద‌లైన ప్రోమోలో సుధీర్-రష్మీ కలిసి యాంకరింగ్ చేస్తూ సంద‌డి చేశారు. ‘ఈటీవీ బలగం’ పేరుతో చేసిన ఈ ఈవెంట్‌లో సీరియల్ నటీనటులు, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలు కమెడియన్లు, సింగర్స్‌తో పాటు కొంతమంది వెండితెర సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు. అయితే ఎంత మంది ఉన్నా కూడా రష్మీ-సుధీర్ జంటనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. చాలా రోజు త‌ర్వాత వీరిద్ద‌రు జంట‌గా క‌నిపించ‌డంతో ప్రేక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేవు.

 

అయితే తాజాగా విడుద‌లైన ప్రోమోలో సుధీర్-రష్మీ కలిసి ఓ రొమాంటిక్ పెర్ఫామెన్స్ ఇవ్వ‌గా, అనంత‌రం… సుధీర్ గుండెలపై వాలిపోయి రష్మీ ఇచ్చిన స్టిల్ కేక పెట్టించింది. ఇక సుధీర్ మాట్లాడుతూ.. మేడమ్ గారు ఏంటో కొంచెం కోపంగా ఉన్నట్లున్నారు” అని అన్నాడు. “మరి నువ్వు వస్తావని ఇన్నాళ్లూ ఎదురుచూశాను.. ఇన్ని రోజులు ఎక్కడున్నావ్ ” అంటూ రష్మీ కాస్త సిగ్గుపడుతూ, కొంత వ‌య్యారంగా అడిగింది. “నేను ఎక్కడున్నా నువ్వు మాత్రం ఇక్కడ (గుండెల్లో) ఉంటావ్ కదా” అని సుధీర్ చెప్పగానే బ్యాక్ గ్రౌండ్‌లో ఖుషీ సాంగ్ వేసేసి, చుట్టూ చప్పట్లు, ఈలలు, గోలలతో ఈ సీన్‌ని ఫుల్ హైలైట్ చేశారు. దీంతో ఇప్పుడు మ‌ళ్లీ ర‌ష్మీ-సుధీర్ జంట హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...