Home Film News Anasuya-Vijay Deverakonda: అన‌సూయ‌తో వివాదంపై ఎట్ట‌కేల‌కు స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌
Film News

Anasuya-Vijay Deverakonda: అన‌సూయ‌తో వివాదంపై ఎట్ట‌కేల‌కు స్పందించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Anasuya-Vijay Deverakonda: బుల్లితెర‌పై త‌న అందచందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేసిన అన‌సూయ ఇప్పుడు వెండితెర‌పై ర‌చ్చ చేస్తుంది. వైవిధ్య‌మైన పాత్ర‌ల‌లో క‌నిపిస్తూ అల‌రిస్తుంది. ఇక వివాదాల‌తో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. త‌న‌ని టార్గెట్ చేస్తూ ఎవ‌రైన కామెంట్ చేశారంటే దానిపై వెంట‌నే స్పందిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం అన‌సూయ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ పెట్టిందో మనం చూశాం. దానికి విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ కూడా ధీటుగా బ‌దులిచ్చారు. కొద్ది రోజుల పాటు జ‌రిగిన ఈ గొడ‌వ‌కి అన‌సూయ‌నే పులిస్టాప్ పెట్టింది. త‌న‌కు మ‌నశ్శాంతి కావాల‌ని , అందుకే వివాదాల‌కి దూరంగా ఉంటానంటూ చెప్పుకొచ్చింది.

అయితే అన‌సూయ ఎలాంటి కామెంట్స్ చేసిన ,ఎంత ర‌చ్చ చేసిన కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ ఏనాడు ఈ వివాదంపై స్పందించ‌లేదు. ఖుషీ మూవీ ట్రైల‌ర్ లాంచింగ్ స‌మ‌యంలో విజ‌య్ కి అన‌సూయ‌తో గొడ‌వ గురించి ఓ ప్ర‌శ్న ఎదురైంది. సోష‌ల్ మీడియాలో అన‌సూయతో గొడ‌వ ఏంట‌ని అడ‌గ‌గా,అప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ గొడ‌వ ప‌డేవాళ్ల‌ను అడగాల‌ని చెప్పుకొచ్చాడు. అస‌లు సోష‌ల్ మీడియాలో ఏం న‌డుస్తుందో తెలియ‌దంటూ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చాడు. విజయ్ దేవ‌ర‌కొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మరి దీనిపై అన‌సూయ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

 

ఇక ఇదిలా ఉంటే రీసెంట్‌గా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ఫిలాసఫీ కోట్ ఒకటి పోస్ట్ చేసింది. గతాన్ని మనం మార్చలేము కానీ భవిష్యత్తు ముగింపును మాత్రం మార్చగలం అంటూ త‌న సోష‌ల్ మీడియాలో ఓ ఆస‌క్తిక‌ర కోట్ పెట్టింది. అన‌సూయ ఫిలాస‌ఫీ మాట్లాడే స‌రికి అంద‌రు షాక్ అయ్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో జ‌రిగిన గొడ‌వ వ‌ల్ల‌నే అన‌సూయ‌లో ఇంత మార్పు వ‌చ్చింద‌ని ప‌లువురు చెప్పుకొచ్చారు. ఇక బుల్లితెర‌కి దూరంగా ఉంటున్న అన‌సూయ ఇప్పుడు వెండితెర‌తో బిజీగా ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యానికి వ‌స్తే ఆయ‌న న‌టించిన ఖుషీ సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో మూవీ ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...