Home Film News Manchu Manoj: మ‌నోజ్ రెండో భార్య గ‌ర్భం దాల్చిన‌ట్టు ప్ర‌చారం.. ఇందులో వాస్త‌వ‌మెంత‌?
Film News

Manchu Manoj: మ‌నోజ్ రెండో భార్య గ‌ర్భం దాల్చిన‌ట్టు ప్ర‌చారం.. ఇందులో వాస్త‌వ‌మెంత‌?

Manchu Manoj: మంచు మోహ‌న్ బాబు త‌నయుడు మ‌నోజ్ ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు. ఆయ‌న రెండో పెళ్లి, మంచు విష్ణుతో గొడ‌వ ఇలా పలు విష‌యాల‌తో హాట్ టాపిక్ అయ్యాడు. తాజాగా మ‌నోజ్‌కి సంబంధించిన ఓ విష‌యం ఇప్పుడు ఫిలిం న‌గ‌ర్‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.మంచు మ‌నోజ్ గ‌తంలో వివాహం జ‌ర‌గ‌గా, 2019లో ఆమెతో విడిపోయాడు. ఇక కొన్నాళ్ల‌పాటు సోలోగా ఉన్న మ‌నోజ్ 2023 మార్చి 3న భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. మంచు లక్ష్మీ ఇంట్లోనే ఈ వివాహం జ‌ర‌గ‌గా, వేడుక‌కి ఇండ‌స్ట్రీకి సంబంధించిన ప‌లువురు ప్రముఖులు, రాజ‌కీయ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. ఇంట్లో వాళ్ల‌కి ఇష్టం లేకుండానే మనోజ్ ఈ పెళ్లి చేసుకున్నాడ‌ని చాలా వార్త‌లు వచ్చాయి.

ఇక భూమా మౌనిక‌కి మొద‌టి భ‌ర్త‌తో ఓ అబ్బాయి జ‌న్మించ‌గా, అత‌ని పేరు ధైర‌వ్ రెడ్డి. ప్ర‌స్తుతం అత‌ను మ‌నోజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అత‌డిని శివుడు ఇచ్చిన కొడుకుగా ఇప్పటికే ప్రకటించిన మ‌నోజ్ చాలా గారాబంగా చూసుకుంటున్నారు. ఇటీవ‌ల అత‌నితో ఆడుకుంటున్న వీడియోని షేర్ చేయ‌గా, ఇందులో మ‌నోజ్ చాలా ఖుషీగా క‌నిపించారు. ఇక ఇప్పుడు మ‌నోజ్‌కి సంబంధించిన వార్త ఒక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. మౌనిక‌తో మనోజ్ ఓ బిడ్డ‌ను ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్. మౌనిక గర్భం దాల్చారని, త్వ‌ర‌లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నార‌ని టాక్. దీనిపై పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

 

ఇక మంచు మనోజ్ కొన్నాళ్లుగా సినిమాల‌కి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆయ‌న సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్నారు. వాట్ ది ఫిష్ టైటిల్ తో ఇప్ప‌టికే మనోజ్ ఒక మూవీ ప్రకటించ‌గా, ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. అంతేకాదు మనోజ్‌కి సంబంధించి ఒకటి రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయని టాక్. . మనోజ్ సిల్వర్ స్క్రీన్ కి దూరమై చాలా కాలం అవుతుండ‌డంతో ఆయ‌న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గ‌త కొద్ది కాలంగా విష్ణుతో మనోజ్, విష్ణుకి విబేధాలు కొనసాగుతున్నాయి. పెళ్లి విష‌యంలోనే ఇద్దరి మధ్య విబేధాలు తారా స్థాయిలో జరిగినట్లు టాక్.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...