Home Film News Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!
Film News

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌నున్నాడు. అయితే ఒక‌వైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు సినిమాల‌తో ప‌వ‌ర్ స్టార్ ర‌చ్చ మాములుగా లేదు. స్ట్రిక్ట్ షెడ్యూల్ తో ముందుకు వెళ్తున్న ప‌వ‌న్…. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’, సుజీత్ దర్శకత్వంలో వస్తున్న OG, హరీశ్ శంకర్ కాంబోలో రెండోసారి నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాలు శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా సినిమాలు చేస్తున్న ప‌వ‌న్ ఇప్పుడు మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది.

 

సురేందర్ రెడ్డి దర్శకుడిగా ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మాత రామ్ తళ్లూరి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న‌ట్టు తెలుస్తుంది.. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ ముందుకు వెళ్లలేదు. అయితే ఇప్పుడ ఈ సినిమాని పవన్ ఓకే చెప్పడంతో సినిమా పనులపై టీమ్ ఫోకస్ పెట్టినట్టు స‌మాచారం. రీసెంట్‌గా ఈ సినిమా కొత్త ఆఫీస్ పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కూడా అయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. సురేందర్ రెడ్డి – పవన్ కళ్యాణ్ కాంబోలో ఇది తొలిచిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ త్వ‌రలో కూడా స్టార్ట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త సినిమా పనులు షురూ కావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక నేడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే కావ‌డంతో పవన్ కెరీర్ లోనే ప్రత్యేక చిత్రంగా నిలిచిన ‘గుడుంబా శంకర్’ కూడా రీరిలీజ్ అయింది. మొత్తానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగనే చెప్పాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యాన్స్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస సినిమాల‌కి ఓకే చేయ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...