Home Film News Sudheer: సినిమాల‌తో బిజీ అవుతున్న సుడిగాలి సుధీర్.. ఒక్కో సినిమాకి అంత పుచ్చుకుంటున్నాడా..!
Film News

Sudheer: సినిమాల‌తో బిజీ అవుతున్న సుడిగాలి సుధీర్.. ఒక్కో సినిమాకి అంత పుచ్చుకుంటున్నాడా..!

Sudheer: బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌తో ఫేమ‌స్ అయిన ఆర్టిస్ట్‌లు చాలా మందే ఉన్నారు. వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. ఆయ‌న కమెడీయ‌న్‌గాను హోస్ట్‌గాను అద‌ర‌గొడుతున్నాడు. సుడిగాలి సుధీర్ మొన్న‌టి వ‌ర‌కు జ‌బ‌ర్ధ‌స్త్‌లోను, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోల‌లో సంద‌డి చేసే వారు. ఆ త‌ర్వాత మాటీవీకి షిఫ్ట్ అయి అక్క‌డ పలు షోలు చేశాడు. ప్ర‌స్తుతం సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. అయితే  కేవలం జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు సుడిగాలి సుధీర్. ప్ర‌స్తుతం సినిమాల ఎంపిక‌లో  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ‘గాలోడు’ సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో.. ఇటీవల తన నాలుగో సినిమాను  కూడా మొద‌లు పెట్టాడు.

‘పాగల్’ ఫేమ్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్లపై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ల, బెక్కం వేణుగోపాల్ నిర్మాణంలో రూపొందుతుంది. ఇక ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్ సరసన దివ్య భారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘GOAT – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’ అనే ఆసక్తికర  టైటిల్‌ను చిత్రానికి ఫిక్స్ చేసి చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. అయితే  మంచి కథతో వస్తున్న‌ తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుందని చిత్ర బృందం తెలియ‌జేసింది.  అయితే సుడిగాలి సుధీర్ రెమ్యున‌రేష‌న్ విష‌యం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.

గాలోడు సినిమాతో రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసుకున్న సుడిగాలి సుధీర్ ప్ర‌స్తుతం త‌ను చేస్తున్న సినిమాల‌కి  రెండు కోట్ల రూపాయలకు తక్కువ రెమ్యున‌రేష‌న్  డిమాండ్ చెయ్యడం లేదట.  క్రేజ్ ఉన్న‌ప్పుడే క్యాష్ చేసుకోవాల‌ని అని భావించిన సుడిగాలి సుధీర్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మాత్రం ఒక పాయింట్ వ‌ద్దే స్టిక్ అయి ఉన్న‌ట్టుగా తెలుస్తుంది. సుడిగాలి సుధీర్, ర‌ష్మీ గౌత‌మ్ ల వ్య‌వ‌హారం ఇండ‌స్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్. వీరిద్ద‌రి మ‌ధ్య ఏం న‌డుస్తుందో ఎవ‌రికి తెలియ‌దు. వీరి గురించి వ‌చ్చే వార్త‌లు మాత్రం అభిమానుల‌కి మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...