Home Film News Sri Reddy: మ‌రోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అత‌నొక్క‌డే రియ‌ల్ హీరో అంటూ కామెంట్
Film News

Sri Reddy: మ‌రోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. అత‌నొక్క‌డే రియ‌ల్ హీరో అంటూ కామెంట్

Sri Reddy: శ్రీరెడ్డి.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పెద్ద హీరోయిన్ కాక‌పోయిన కూడా అంత‌కు మించి పాపులారిటీ సొంతం చేసుకుంది. పెద్ద హీరోల నుండి చిన్న హీరోల వ‌ర‌కు అంద‌రిని టార్గెట్ చేస్తూ వారిపై దారుణమైన కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఒక్క‌సారిగా వార్త‌ల‌లోకి వ‌చ్చిన ఈ అమ్మ‌డు ఎప్పుడు ఎవ‌రి మీద కామెంట్స్ చేస్తుందో ఆమెకే తెలియ‌దు. ప్ర‌తిసారి కావాల‌ని  హీరోలను టార్గెట్ చేయడం వల్ల ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయ‌డంతో త‌మిళ‌నాడులో సెటిలైంది. అక్క‌డికి వెళ్లిన కూడా ఆమె తీరు మార‌లేదు. ఏదో ఒక సంద‌ర్భంలో ఎవ‌రో ఒక హీరోని టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంటుంది.

ఇండ‌స్ట్రీలో ఇత‌ర హీరోల సంగ‌తేమో కాని మెగా హీరోల గురించి మాత్రం తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవిల గురించి దారుణ‌మైన కామెంట్స్ చేస్తుంటుంది. అయితే శ్రీ రెడ్డి మ‌రోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల‌  టాలీవుడ్ లో మెగా భజన మరీ ఎక్కువ అవుతుండ‌డం మ‌నం చూస్తున్నాం. అయితే  రిజల్ట్ ఎలా ఉంటుందో భోళా శంకర్ ను చూస్తేనే  మ‌న‌కు అర్థం అవుతుంది. అస‌లు  అసలు మెగా ఫ్యామిలీలో ఉన్న‌దంతా కూడా డ‌మ్మీగాళ్లే. ఒక్క అల్లు అర్జున్ మాత్రం త‌న సొంత ట్యాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడ‌ని శ్రీరెడ్డి పేర్కొంది.

అల్లు అర్జున్‌లో ఎంతో టాలెంట్ ఉంది. అందుకే ఆయ‌న‌కు నా ఫుల్ స‌పోర్ట్ అందిస్తాను. మిగ‌తా వాళ్లంతా వేస్ట్‌.  వారంద‌రు  కేవలం బిల్డప్ స్టార్లు మాత్రమే. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తీసుకువచ్చి ఇక్కడ రీమేక్ చేసి ఏదో గొప్ప‌గా ఫీల‌వుతుంటారు. అల్లు అర్జున్ ఇప్పటి వ‌ర‌కు ఒక్క రీమేక్ చేయ‌లేదు. సొంత‌గా ఉన్న టాలెంట్‌తో విజ‌యాల‌ని అందుకుంటూ ఉంటాడు. మిగ‌తావాళ్లందరు మాత్రం రీమేక్ స్టార్స్ అని చెప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనే కుంప‌టి పెట్టింది.  ఆమె వ్యాఖ్య‌ల‌పై మెగా ఫ్యాన్స్ భ‌గ్గుమంటున్నారు. నీకు ఏం తెలుస‌ని ఇంత చెత్త‌గా మాట్లాడుతున్నావంటూ గ‌ట్టిగా ఇచ్చిప‌డేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...