Home Film News Rashmika: అత‌నితో విడిపోవ‌డానికి కార‌ణ‌మిదే.. గొడ‌వ‌పై క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌
Film News

Rashmika: అత‌నితో విడిపోవ‌డానికి కార‌ణ‌మిదే.. గొడ‌వ‌పై క్లారిటీ ఇచ్చిన ర‌ష్మిక‌

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఇప్పుడు వ‌రుస సినిమాల‌తో తెగ సంద‌డి చేస్తుంది. హిట్‌, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజులుగా ఓ ఇష్యూతో వార్త‌ల‌లో నిలుస్తుంది.రష్మిక మందన్న మేనేజర్ ఆమెని మోసం చేసి   దాదాపు 80 లక్షల రూపాయలు తీసుకొని ఉడాయించాడ‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి.  విష‌యాన్ని పెద్దది చేయ‌డం ఇష్టం లేకనే ర‌ష్మిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని టాక్ అయితే నడిచింది. ఈ ఇష్యూపై ర‌ష్మిక మందాన ఎట్ట‌కేల‌కు స్పందించింది. నేను, నా మేనేజర్ బలవంతంగా విడిపోలేద‌ని, మా గురించి వ‌స్తున్న‌ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరించారు ర‌ష్మిక‌.

నాకు, నా మేనేజ‌ర్  మ‌ధ్య ఎలాంటి నెగెటివిటీ లేదు. స్నేహపూర్వకంగా విడిపోవాలని మేము నిర్ణయించుకున్నాము. మేము  ఇద్ద‌రం ప్రొఫెషనల్స్, ఇకపై ఇండిపెండెంట్‌గా పని చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆ క్ర‌మంలోనే విడిపోయామ‌ని  రష్మిక  మేనేజర్ పేర్కొన్నారు. మొత్తానికి ర‌ష్మిక గురించి గ‌త రెండు మూడు రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది. కాగా, ఓ వ్యక్తి కొన్నేళ్లుగా ర‌ష్మిక‌కి మేనేజర్ గా పని చేస్తున్నారు. సినిమా కాంట్రాక్ట్, రెమ్యునరేషన్, అడ్వర్టైజింగ్, బిజినెస్, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్, ఇతర ఖర్చులను కూడా నిర్వహించారు.  మేనేజర్ ఉద్యోగం మానేయ‌డంతో అనేక పుకార్లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. వాటికి ర‌ష్మిక పులిస్టాప్ పెట్టింది.

ఇక ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప2’ చిత్రంతో నటిస్తోంది. ఈ మూవీని సుకుమార్ తెర‌కెక్కిస్తున్నాడు. దీనికి తొలి పార్ట్‌గా వ‌చ్చిన పుష్ప దేశవ్యాప్తంగా చాలా పెద్ద‌ హిట్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రంలో రష్మిక పోషించిన శ్రీవల్లి క్యారెక్టర్‌కు సైతం మంచి గుర్తింపు దక్కింది. పుష్ప క్రేజ్ తో బాలీవుడ్ కి వెళ్లిన ర‌ష్మిక    గతేడాది బాలీవుడ్‌లో గుడ్ బై చిత్రంతో ప‌ల‌క‌రించింది. ఆ  తర్వాత ‘మిషన్ మజ్ను’ అనే  చిత్రంలో నటించింది. అయితే ఈ రెండు హిందీ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద  తీవ్రంగా నిరాశపరిచాయి. త‌మిళంలో  విజయ్‌తో జోడీగా నటించిన ‘వారిసు’ సైతం మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ప్రస్తుతం ర‌ష్మిక‌ ఆశలన్నీ ‘యానిమల్’తో పాటు ‘పుష్ప 2’ చిత్రంపైనే ఉన్నాయి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...