Home Film News Venu Swamy: వేణు స్వామితో మ‌రో హీరోయిన్ పూజ‌లు.. మ‌నోడికి ఇంత డిమాండ్ ఏంటి?
Film News

Venu Swamy: వేణు స్వామితో మ‌రో హీరోయిన్ పూజ‌లు.. మ‌నోడికి ఇంత డిమాండ్ ఏంటి?

Venu Swamy: ప్ర‌ముఖ జ్యోతిష్కుడు.. వేణు స్వామి పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో మారుమ్రోగిపోతుంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. అలాంటి  ఫ్యాన్ ఫాలోయింగ్ వేణు స్వామికి ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. సోష‌ల్ మీడియాని ఉప‌యోగించుకొని   స్టార్ట్ సెలబ్రిటీస్ ల లైఫ్ లో ఏం జరగబోతుందో అభిమానులకి కళ్లకు కట్టినట్లు చూపిస్తూ పాపులారిటీ ద‌క్కించుకున్నాడు వేణుస్వామి. ఎప్పుడైతే స‌మంత‌, నాగ చైత‌న్య విడిపోతార‌ని ఆయ‌న చెప్పాడో అప్ప‌టి నుండి ఆయ‌న చెప్పే జాత‌కాల‌పై సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీల‌కు న‌మ్మ‌కం ఏర్ప‌డింది. ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ కూతురి జాత‌కం గురించి కూడా చెప్పి వార్త‌ల‌లోకి ఎక్కారు.


అయితే వేణు స్వామి ఇటీవ‌ల హీరోయిన్స్ ఇంట్లో పూజ‌లు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఇంట్లో కొన్ని సంవ‌త్స‌రాల క్రితం పూజ‌లు చేసిన వేణు స్వామి రీసెంట్‌గా నిధి అగ‌ర్వాల్ ఇంట్లో కూడా పూజ‌లు చేశాడు.. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేసింది. ఆ వీడియోలో   నిధి అగర్వాల్‌.. పింక్ కలర్ చుడీదార్ ధరించి ఉండ‌గా.. వేణు స్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ ఆమె కలశానికి పూజలు చేశారు. నిధి అగర్వాల్ పక్కనే కూర్చొని వేణుస్వామి ఈ పూజ చేయించారు. రాజ శ్యామ‌ల యాగం చేయించిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఇక ఇప్పుడు డింపుల్ హ‌య‌తితో వేణు స్వామి పూజ చేయించాడు. ఆమె ఇంట్లో వేద మంత్రాల న‌డుమ డింపుల్ హ‌య‌తికి పూజ‌లు చేయించాడు. ప్ర‌స్తుతం డింపుల్ హ‌య‌తి యాగంకి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ హల్‌చ‌ల్ చేస్తుంది. డింపుల్ హ‌య‌తి ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఇండియ‌న్ 2 సినిమా చేస్తుంది. అయితే  వేణు స్వామి తాను చేసే పూజలలో మద్యం – మాంసం నైవేద్యంగా పెడతారట . ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా తాను అదే చేస్తాన‌ని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చాడు.  పూజ చేయించుకున్న వాళ్లకి మ‌ద్యాన్నే ప్రసాదంగా కూడా పెడతారట . అందులో దాపరికం ఏమీ ఉండదు అంటూ ఓపెన్‌గా చెబుతాడు వేణు స్వామి.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...