Home Film News Amani: పెళ్లి చేసుకొని పెద్ద త‌ప్పు చేశాను.. ఆమ‌ని సంచ‌ల‌న కామెంట్స్
Film News

Amani: పెళ్లి చేసుకొని పెద్ద త‌ప్పు చేశాను.. ఆమ‌ని సంచ‌ల‌న కామెంట్స్

Amani: తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న అందం, అభిన‌యంతో పాటు ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు కొల్ల‌గొట్టిన అందాల భామ ఆమ‌ని.అచ్చ తెలుగు ఆడ‌ప‌డుచులా ఆమ‌ని ప్ర‌తి ఒక్క‌రికి  ఎంత‌గానో క‌నెక్ట్ అయింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వరుస సినిమాలు చేసిన ఆమ‌ని ఏ మాత్రం  అందాల ఆరోబోతలు లేకుండానే అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకుంది . మిస్టర్ పెళ్ళాం, శుభలగ్నం, జంబలకిడి పంబ, శుభ సంకల్పం లాంటి ఎన్నో మరపురాని సినిమాలు చేసిన ఆమ‌ని త‌న కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు చేసింది. అయితే పెళ్ల‌య్యాక సినిమాల‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన ఆమ‌ని ఇప్పుడు మ‌ళ్లీ స‌పోర్టింగ్ రోల్స్ లో అల‌రిస్తుంది.
హీరోయిన్‌గా ప‌దేళ్ల పాటు స‌త్తా చాటే అవ‌కాశం ఉన్నా కూడా ఆమ‌ని పెళ్లి చేసుకొని త‌న కెరీర్ మొత్తం నాశనం చేసుకుంది. ఇటీవ‌ల ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేయ‌గా, ఇప్పుడు అవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆమ‌ని మాట్లాడుతూ.. నా కెరీర్  మంచి పీక్స్ లో ఉన్నప్పుడే మా ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేసారు. పేరెంట్స్ మాట కాదనలేక నేను కూడా పెళ్ళికి చేసుకున్నాను. అయితే   పెళ్లి చేసుకునే ముందు నా భర్త నాకు  కొన్ని షరతులు పెట్టాడు.  నేను పెళ్ళయాక సినిమాలు మానేయాల‌ని చెప్ప‌డం, దీనికి నేను వెంటనే ఒప్పుకున్నాను.
ఆ స‌మ‌యంలో నాతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద బ్యానర్స్ మరియు స్టార్ హీరోలు రెడీ గా ఉన్ప్ప‌టికీ పెళ్లి చేసుకోవ‌డం వ‌ల‌న అవ‌న్నీ కూడా పోయాయి. అస‌లు పెళ‌లి చేసుకొని కెరీర్ వ‌దులుకున్నందుకు చాలా బాధ‌ప‌డ్డాను. పెళ్లి చేసుకున్న త‌ర్వాత నేను నా భ‌ర్త సినిమాలు మానేయ‌మంటే ఎలా ఒప్పుకున్నానో అని ప్ర‌తి రోజు ఎంతో బాధ‌ప‌డ్డాను. పెళ్లి చేసుకొని పెద్ద త‌ప్పు అయితే చేశారు. సినిమాలు మానేయ‌మంటే నేనే ఎలా ఒప్పుకున్నాన‌ని ప్రతి రోజు ఆవేద‌న చెందాను. అయితే పెళ్లై పిల్లలు పుట్టాక వారే లోకంగా బ్ర‌తికాను. ఇక కొన్ని రోజుల త‌ర్వాత సినిమాల‌లో న‌టించే అవకాశాలు వ‌స్తుండ‌డంతో ఆయ‌న‌ని అడిగాను. అప్పుడు స‌పోర్ట్‌గా నిలిచారు అని ఆమ‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...