Home Film News Balayya: ఆపు నీలొడ అంటూ సుమ‌పై క‌సురుకున్న బాల‌య్య‌.. ఉలిక్కిప‌డ్డ యాంక‌ర‌మ్మ‌
Film News

Balayya: ఆపు నీలొడ అంటూ సుమ‌పై క‌సురుకున్న బాల‌య్య‌.. ఉలిక్కిప‌డ్డ యాంక‌ర‌మ్మ‌

Balayya: సుమ ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎంత సంద‌డి ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎంతో యాక్టివ్ గా ఉంటూ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్నంత సేపు ఆడియ‌న్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తూనే ఉంటుంది. అందుకే సుమ ఉంటే ఈవెంట్ త‌ప్పక హిట్ అవుతుంది. ఇటీవ‌లి కాలంలో సుమ పెద్ద సినిమాల‌తో పాటు చిన్న సినిమాల‌ని సైతం హోస్ట్ చేస్తుంది. ఆ మధ్య టూర్‌కి వెళ్లిన ఈ యాంక‌రమ్మ ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల‌న కాలికి షూ క‌రిచింద‌ని, అందుకే కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుంటున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా చెప్పింది. ఇక ఇప్పుడు తిరిగి మ‌ళ్లీ ఈవెంట్స్ స్టార్ట్ చేసింది. గ‌త రాత్రి హైద‌రాబాద్ లో జ‌గప‌తి బాబు ప్ర‌ధాన పాత్రలో రూపొందిన రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది.

జూలై 7న చిత్రం విడుదల కానుండ‌గా, ప్ర‌మోష‌న్ లో భాగంగా ఈ కార్య‌క్రమం నిర్వ‌హించారు. అయితే ఈ ఈవెంట్‌కి నంద‌మూరి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా హాజ‌రై తెగ సంద‌డి చేశారు. ఇక హోస్ట్‌గా వ‌చ్చిన  సుమ కాస్త డిఫ‌రెంట్ గెటప్‌లో క‌నిపించి అల‌రించింది. అయితే ఈవెంట్‌లో బాలయ్య‌.. సుమ‌ని అయితే ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. వీరిద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ‌లు ఆడియ‌న్స్‌కి అయితే మాంచి కిక్ ఇచ్చాయి. రుద్రంగి ప్రీ రిలీజ్ వేడుక‌లో యాంకర్ సుమ అతిథుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ ఒక్కొక్కరి గురించి స్పీడ్‌గా చెబుతూ వెళ్లింది. ఇక వేదిక‌పైన ఉన్న‌ జగపతి బాబు ప్రసంగించడానికి రెడీ అయ్యారు.

అయితే సుమ మాత్రం జగపతి బాబుకి మైక్ ఇవ్వకుండా ఆయన్ని పొగిడే కార్యక్రమంలో ప‌డింది. అప్పుడు పక్కనే ఉన్న బాలయ్య..  అహే ఆపు.. లొడలొడా వాగేస్తున్నావు అంటూ సరదాగా కసురుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ సుమ వెంట‌నే జ‌గ‌ప‌తిబాబుకి మైక్ ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక జ‌గ‌ప‌తిబాబుకి బాల‌కృష్ణ‌కి లెజెండ్ సినిమా స‌మ‌యంలో మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. ఈ సినిమాతోనే జ‌గ్గూభాయ్ విల‌న్‌గా మారారు.  ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు స‌పోర్టింగ్ క్యారెక్టర్స్ లో న‌టిస్తూనే అప్పుడ‌ప్పుడు ఇలా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...