Home Film News Shruti Haasan: ప‌బ్లిక్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో ఏందీ ఆ ర‌చ్చ‌..శృతి హాస‌న్‌నితిట్టి పోస్తున్న నెటిజ‌న్స్
Film News

Shruti Haasan: ప‌బ్లిక్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో ఏందీ ఆ ర‌చ్చ‌..శృతి హాస‌న్‌నితిట్టి పోస్తున్న నెటిజ‌న్స్

Shruti Haasan: క‌మ‌ల్ హాస‌న్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె చాలా బోల్డ్. చేసే ప‌నులైన‌, మాట్లాడే మాట‌లైన బోల్డ్‌గానే ఉంటాయి.కెరీర్ మొద‌ట్లో వ‌రుస సినిమా లు చేస్తూ వ‌చ్చిన కూడా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అయితే పవన్‌ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన శృతి హాసన్…ఇక ఎక్కడ ఆగ‌లేదు. కెరీర్‌లో దూసుకుపోయింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఈ అమ్మ‌డికి రాలేదు. ప్ర‌స్తుతం భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా ల్లో కూడా శృతి క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మ‌రోవైపు సీనియర్ హీరోల‌కి కూడా బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది శృతి.

త‌న తండ్రి కమల్ హాసన్‌కు తోటి హీరోలైన చిరంజీవి, బాల‌కృష్ణ‌తో నటించి మంచి హిట్స్ సాధించ‌డం శృతి హసన్‌కే మాత్రమే చెల్లింది. అయితే శృతి ఓ విదేశి వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డి కొన్నాళ్లు అత‌నితో డేటింగ్ చేసింది. అయితే అత‌నితో బ్రేక‌ప్ చెప్పాక రీఎంట్రీ ఇచ్చింది. 2021లో రవితేజ హీరో వ‌చ్చిన క్రాక్‌లో క‌థ‌నాయిక‌గా న‌టించి అదరగొట్టింది. అనంత‌రం శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో మెరిసి, ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది. ఈ యేడాది వ‌చ్చిన వీరసింహారెడ్డి ,‘వాల్తేరు వీరయ్య’ మూవీలలో కూడా శృతి క‌థానాయిక‌గా న‌టించి మంచి విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

 

శృతి హాస‌న్ గ‌త‌కొంత కాలంగా డేటింగ్ వ్య‌వ‌హారాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తుంది. డూడుల్‌ ఆర్టిస్టు శాంతను హజారికతో కొంతకాలంగా ప్రేమ‌లో ఉందిశృతి. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే తాజాగా వీరిద్దరు ఎయిర్‌పోర్ట్‌లో మెరిసారు. ఎయిర్‌పోర్ట్ వద్ద అంద‌రు చూస్తుండ‌గానే హగ్గులిచ్చుకుంటూ నానా రచ్చ చేశారు. ప్రియుడిని గట్టిగా కౌగిలించుకున్న శృతి ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇక బ్లాక్ డ్రెస్‌లో శృతి హాస‌న్ క్యూట్ లుక్స్ కి నెటిజ‌న్స్ మైమ‌రచిపోతున్నారు. ఇక ఈ అమ్మ‌డు ప్రస్తుతం ప్రభాస్‌తో `సలార్‌`అనే చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో యాక్షన్‌ మూవీగా తెరకెక్కుతుంది. ఈసినిమా ద్వారా ప్రభాస్‌తో తొలిసారి జోడీ కడుతుంది శృతి.

Related Articles

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...