Home Film News Green Mat: షూటింగ్స్ గ్రీన్ మ్యాట్‌లోనే చేయ‌డానికి కార‌ణం ఏంటి…!
Film News

Green Mat: షూటింగ్స్ గ్రీన్ మ్యాట్‌లోనే చేయ‌డానికి కార‌ణం ఏంటి…!

Green Mat: ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు చాలా బిజీ లైఫ్ గ‌డుప‌తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాల వ‌ల‌న చాలా స్ట్రెస్‌కి కూడా గుర‌వుతున్నారు. అలాంటి స‌మ‌యంలో సినిమా ప్ర‌తి ఒక్క‌రికి మంచి వినోదం పంచుతుంది. ఇప్ప‌టి సినిమాలు భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్నాయి. ఇందులో క‌ళ్లు చెదిరే గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తున్నాయి. కొత్త ప్ర‌పంచాన్ని సృష్టిస్తూ ప్రేక్ష‌కుల‌ని మంత్ర ముగ్ధుల‌కి గురి చేస్తున్నారు. ఇదంతా గ్రాఫిక్స్ వ‌ల్ల‌నే సాధ్య‌మ‌వుతుంది. గ్రాఫిక్స్ వ‌ల్ల సినిమాలోని న‌టీ న‌టులు పెద్ద పెద్ద కొండ‌ల మీద నుండి దూక‌డం, చంద్ర గ్ర‌హాం మీద‌.. మంచు కొండల పైనా ఉన్న‌ట్టుగా చూపించ‌గ‌లుగుతున్నారు.

అయితే గ్రాఫిక్స్ కి సంబంధించిన షూటింగ్ స‌మ‌యం లో వెన‌క గ్రీన్ మ్యాట్ ఉంటుంది. అన్ని రంగులు ఉండ‌గా, గ్రీన్ మ్యాట్ ను ఎందుకు ఉంచుతారో చాలా మంది కి తెలియదు. ఈ గ్రీన్ మ్యాట్ ఉండ‌టం వ‌ల్లనే అద్భుతాలు సృష్టించ‌డం సాధ్య‌మ‌వుతుంది. షూటింగ్ స‌మ‌యంలో బ్యాక్ గ్రౌండ్ షూటింగ్ వెండితెర‌పై క‌నిపించ కుండా ఉండ‌టానికి గ్రీన్ మ్యాట్ వాడ‌తారు. ఇక‌ వీడియో ను ఎడిట్ చేసే స‌మ‌యం లో గ్రీన్ క‌ల‌ర్ మొత్తాన్ని డిలీట్ చేస్తారు. అప్పుడు మ‌న‌కు కావ‌ల‌సిన ప్లేస్‌ని అక్క‌డ పొందుప‌రుస్తారు. చూసే వారికి మాత్రం నిజంగానే ఆ ప్లేస్‌లో షూటింగ్ చేసారా అని ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.

 

బాహుబ‌లి,ఆర్ఆర్ఆర్, ఆదిపురుష్ వంటి చిత్రాల‌కి ఎక్కువ‌గా గ్రాఫిక్ వ‌ర్క్ చేసార‌నే విష‌యం తెలిసిందే. దీని కోసం గ్రీన్ మ్యాట్ వాడారు. అయితే ఈ గ్రీన్ అనే క‌ల‌ర్ వాడ‌డానికి అస‌లు కార‌ణం ఏంటంటే ఇది.. మాన‌వ శ‌రీరం లో బాడీ కి గానీ, వెంట్రుక‌లకు గానీ ఇత‌ర అవ‌యావ‌లకు గానీ ఏ మాత్రం మ్యాచ్ కాదు. ఎడిటింగ్ లో కేవ‌లం ఆ ఒక్క క‌ల‌ర్ ను మాత్ర‌మే డిలిట్ చేస్తే మిగ‌తా ఏభాగాలు కూడా మిస్ కావు. ఈ కార‌ణం వ‌ల్ల‌నే గ్రాఫిక్స్ స‌న్నివేశాల ను షూటింగ్ చేసే స‌మ‌యంలో గ్రీన్ మ్యాట్ ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. ఒక‌ప్పుడు సినిమాల‌కే గ్రీన్ మ్యాట్ వాడేవారు. ఇప్పుడు సీరియ‌ల్స్ లోను గ్రాఫిక్స్ స‌న్నివేశాలు వాడుతున్న నేప‌థ్యంలో గ్రీన్ మ్యాట్ వినియోగిస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...