Home Film News Samantha: ఆధ్యాత్మిక సేవ‌లో సమంత‌.. ఆ కార‌ణం ఏంటో తెలిస్తే అవాక్క‌వుతారు..!
Film News

Samantha: ఆధ్యాత్మిక సేవ‌లో సమంత‌.. ఆ కార‌ణం ఏంటో తెలిస్తే అవాక్క‌వుతారు..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లి కాలంలో చాలా హాట్ టాపిక్‌గా మారుతుంది. ఆమె సినిమాలు, ఆరోగ్యం విష‌యంలో వార్త‌ల‌లో నిలుస్తుంది. యశోద చిత్రం త‌ర్వాత మంచి హిట్ అందుకున్న స‌మంత‌ శాకుతలంతో భారీ డిజాస్టర్ ను అందుకుంది. ప్రస్తుతం ఈ అందాల తార.. తెలుగులో విజయ్ దేవరకొండతో ఖుషి, హిందీలో సిటాడెల్ ఇండియన్ వెర్షన్ చిత్రాలు చేస్తుండ‌గా, ఈ రెండు చిత్రాల షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి చేసింది. ఇక ఇటీవ‌ల స‌మంత ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

కొన్ని నెల‌ల క్రితం మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత ఇటీవ‌ల‌ కోలుకుంది.కోలుకున్న త‌ర్వాత‌ తిరిగి నటించడం స్టార్ట్ చేశారు. త‌ను క‌మిటైన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేసింది. ఇక ఎలాంటి ప్రాజెక్ట్స్ కి సైన్ చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఏడాది కాలాన్ని ఆమె చికిత్స కోసం కేటాయించనున్నారని సమాచారం. అందుకు సమంత అమెరికా వెళుతున్నారని తెలుస్తుంది. అక్కడే కొన్ని నెలల పాటు ఉంటారట. సమంత వైద్యానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని స‌మాచారం.

 

సమంత చికిత్స కోసం అమెరికా వెళుతున్న విష‌యంలో అనేక అనుమానాలు మిగిలి ఉండ‌గా, రీసెంట్‌గా ఆమె మిత్రుడు హెయిర్ స్టైలిస్ట్ రోహిత్ బత్కర్ దీనిపై పరోక్షంగా నిజమే అని తెలియజేశాడు . ఇక త్వ‌ర‌లో స‌మంత అమెరికా ప్ర‌యాణం చేయ‌నుండ‌గా, ఆమె ప్ర‌స్తుతం పుణ్య‌క్షేత్రాల‌ని సంద‌ర్శిస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో గల వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ కి వెళ్లారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. కీలకమైన చికిత్సకు ముందు సమంత మనో ధైర్యం కోసం ఇష్ట దైవాల దర్శనం చేసుకుంటారని అంద‌రు అనుకుంటున్నారు. సమంత డివోషనల్ లుక్ ఆకట్టుకోగా ఫ్యాన్స్ దీనిపై వెరైటీగా కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత క్రిస్టియన్ అయిన కూడా హిందూమతాన్ని ఆచరిస్తారు.నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత రెండేళ్ల క్రితం విడాకులు ఇచ్చింది.

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...