Home Film News Colors Swathi: టాలీవుడ్‌లో విడాకుల‌కి సిద్ధ‌మైన మ‌రో జంట‌.. ఏమైంది వీళ్ల‌కి
Film News

Colors Swathi: టాలీవుడ్‌లో విడాకుల‌కి సిద్ధ‌మైన మ‌రో జంట‌.. ఏమైంది వీళ్ల‌కి

Colors Swathi: ఈ మ‌ధ్య టాలీవుడ్‌లో విడాకుల పర్వం కొన‌సాగుతుంది. విడాకుల‌కి ముందు సోష‌ల్ మీడియాలో ఫొటోలు తొల‌గించ‌డం, కొద్ది రోజుల పాటు దీనిపై మౌనం వ‌హించి , స‌డెన్‌గా ఏదో ఒక రోజు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. స‌మంత త‌న విడాకుల ప్ర‌క‌ట‌న‌కి ముందు నాగ చైతన్యతో దిగిన అన్ని ఫొటోల‌ని డిలీట్ చేసింది. ఇటీవ‌ల నిహారిక కూడా అదే ప‌ని చేసి విడాకుల‌పై హింట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు క‌ల‌ర్ స్వాతి కూడా త‌న సోష‌ల్ మీడియా నుండి భ‌ర్త ఫొటోలు తొల‌గించ‌డంతో ఈ అమ్మ‌డు కూడా త‌న భ‌ర్త నుండి విడిపోయేందుకు సిద్ధ‌మైందా అనే చ‌ర్చ న‌డుస్తుంది.

తన క్యూట్ మాటలతో హోమ్లీ గర్ల్ గా క‌నిపిస్తూ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది క‌ల‌ర్స్ స్వాతి.ముందు యాంక‌ర్‌గా స‌త్తా చాటిన స్వాతి ఆ త‌ర్వాత సినిమాలలో హీరోయిన్‌గా రాణించింది. 2018లో స్వాతి ప్రేమ వివాహం చేసుకోగా, ఆమె భర్త పేరు వికాస్ వాసు . వృత్తిరీత్యా పైలట్ అయిన వికాస్ విదేశాల్లో ప‌ని చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పెళ్లి త‌ర్వాత స్వాతి విదేశాల‌కి చెక్కేసింది. ఇక గత ఏడాది తిరిగి కమ్ బ్యాక్ ఇచ్చిన స్వాతి… పంచతంత్ర టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఈ మూవీ అనుకున్నంతగా ఆడక‌పోయిన‌ప్ప‌టికీ స్వాతికి మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు ఈ అమ్మ‌డు రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తుంది.

 

అయితే స్వాతి ఉన్న‌ట్టుండి త‌న భ‌ర్త ఫొటోల‌ని సోష‌ల్ మీడియా నుండి తొల‌గించేసింది. దీంతో ఈ అమ్మ‌డు కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తుంద‌ని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. భ‌ర్త‌తో విభేదాలు కార‌ణంగా స్వాతి అత‌ని నుండి విడిపోయి ఉంటుంద‌ని అంద‌రు భావిస్తున్నారు. ఇక స్వాతి .. కలర్స్ పేరుతో ప్రసారమైన షోతో ఫుల్ పాపులర్ అయ్యింది. దర్శకుడు కృష్ణవంశీ డేంజర్ మూవీతో వెండితెరకు పరిచయం కాగా, ఆ త‌ర్వాత ఈ భామ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైవిధ్య‌మైన చిత్రాలు చేసింది. ఇక ఇదిలా ఉంటే సుమారు రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే విధంగా స్వాతి విడాకులు తీసుకుంటోందని ప్ర‌చారం జ‌రిగింది. ఇన్‌స్టా నుండి పిక్స్ తీసేయ‌డంతో క‌ల‌క‌లం రేగింది. అప్పుడు తాను త‌న భర్త ఫొటోలను ఆర్కైవ్స్‌లో పెట్టుకున్నట్టు చెప్పి వివ‌ర‌ణ ఇచ్చింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...