Home Film News Samantha: అర్ధ న‌గ్నంగా చ‌ల్ల‌ని నీళ్ల‌లో కూర్చున్న స‌మంత‌.. ఎన్ని క‌ష్టాలొచ్చాయ్ అంటున్న ఫ్యాన్స్
Film News

Samantha: అర్ధ న‌గ్నంగా చ‌ల్ల‌ని నీళ్ల‌లో కూర్చున్న స‌మంత‌.. ఎన్ని క‌ష్టాలొచ్చాయ్ అంటున్న ఫ్యాన్స్

Samantha: మొన్న‌టి వ‌ర‌కు వ‌రుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న స‌మంత ఇప్పుడు ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. త‌న ఆరోగ్యం పూర్తిగా కుదుట ప‌డే వర‌కు సినిమాలు చేయ‌నంటుంది. ప్రస్తుతం యోగ, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న స‌మంత ప్ర‌స్తుతం తాను చాలా ఆనందంగా ఉన్నానని హిట్స్ ఇస్తూ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది . గత కొంత కాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతూ ఇబ్బందులు ప‌డుతున్న సమంత.. తాను కమిటైన సినిమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసి ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకుంది. ఈ బ్రేక్‌ లోనే అమెరికా వెళ్లి అక్కడ మయోసైటిస్ కి మెరుగైన చికిత్స తీసుకోవాలని ఆమె అనుకుంటుంద‌ట‌.

ప్ర‌స్తుతం ఇండోనేషియాలోని బాలీలో ఉన్న స‌మంత ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇస్తుంది. తాజాగా సమంత త‌న పోస్ట్‌లో స్విమ్ సూట్ ధరించి ఐస్ వాటర్ లో దిగిన వీడియో షేర్ చేసింది. ఇక ఆ వాటర్ టెంపరేచర్ 4 డిగ్రీలు అని చెప్పిన స‌మంత ఆ చల్లని నీళ్లలో దాదాపు 6 నిమిషాలు పాటు ఉన్నారు. స‌మంత అర్ధ‌న‌గ్నంగా ఈ సాహ‌సం చేయ‌డంతో ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. సాధార‌ణంగా కూల్ వాట‌ర్‌లో అంత సేపు ఉండ‌డం ఆషామాషీ కాదు. శరీరం ఎంతో బాధకు గురవుతుంది. మొండిదైన సమంత ఆ సాహసం పూర్తి చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది. స‌మంత సాహ‌సాన్ని పొగ‌డ‌కుండా ఎవ‌రు ఉండ‌లేక‌పోతున్నారు.

 

గత ఏడాది త‌న‌కి మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత చాలా రోజు పాటు సినిమాలు, సోష‌ల్ మీడియాకి దూరంగా ఉంటూ ఇంటికి పరిమితమయ్యారు. కోలుకున్నాక త‌న క‌మిటైన సినిమాల‌ షూటింగ్స్ లో పాల్గొన్నారు. ఖుషి షూటింగ్ కొద్ది రోజుల క్రితం పూర్తి చేశారు. ద్రాక్షారామంలో విజయ్ దేవరకొండ-సమంత మీద పతాక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. కంప్లీట్‌ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రిస్తుంద‌ని చెబుతున్నారు. ఇక స‌మంత న‌టించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కూడా త్వ‌ర‌లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...