Home Film News Roja: పిచ్చి మాట‌లు మాట్లాడితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ళ్లు రాల‌తాయి.. రోజా వార్నింగ్
Film News

Roja: పిచ్చి మాట‌లు మాట్లాడితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ళ్లు రాల‌తాయి.. రోజా వార్నింగ్

Roja: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపలు ఏపీ రాజ‌కీయాల‌లో పెద్ద దుమార‌మే రేపుతున్నాయి. మలిదశ వారాహి యాత్ర లో భాగంగా  ఏలూరు బహిరంగ సభలో ప‌వ‌న్ క‌ళ్యాణ్  వలంటీర్లను తప్పుపడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో 17 వేల మంది మహిళలు  అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ప‌వన్ చేసిన ఆరోప‌ణ‌లు దుమారం రేపుతున్నాయి. ప‌వ‌న్  వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు విమ‌ర్శ‌ల దాడి చేస్తూనే ఉన్నారు. మ‌రోవైపు వ‌లంటీర్స్ ప‌వ‌న్  దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టి  బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

అయితే పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి రోజా స్పందించారు. ఇటు ప్రభుత్వానికి, అటు ప్ర‌జ‌ల‌కి మధ్య వారధిగా ఉండే వలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆమె అన్నారు.  వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా.., వ‌లంటీర్లు ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారని  చాలా దుర్మార్గంగా మాట్లాడారు. అస‌లు అక్రమ ర‌వాణా, మిస్సింగ్ గురించి నీకు తెలుసా? క‌నీసం  వార్డు మెంబర్‌గాకూడా  గెలవని పవన్‌కు రిపోర్ట్ ఇచ్చిందెవ‌రు అని  రోజా ప్ర‌శ్నించారు… అప్పుడు చంద్రబాబు వలంటీర్ వ్యవస్థ పై నోటికొచ్చినట్టు మాట్లాడాడని అన్న రోజా, ఇప్పుడు దత్త పుత్రుడు విషం చిమ్ముతున్నాడంటూ విమ‌ర్శ‌లు గుప్పించింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో పిలుస్తానంటూ ప‌వ‌న్ అన‌డంపై కూడా రోజా విమ‌ర్శ‌లు చేసింది. నీకే ప్ర‌జ‌ల‌లో గౌర‌వం లేదు, అలాంటి నువ్వు ఇచ్చే గౌరవం మాకు అవ‌సరం లేదు అని రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 36 సంవత్సరాల వయస్సులో జగన్ మొదటిసారిగా ఎంపీ కాగా,  55 ఏళ్లు వచ్చినా పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయాడంటూ రోజా ఎద్దేవా చేశారు.  కోవిడ్ సమయంలో ప్రాణ భయంతో పవన్ కల్యాణ్, చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి దాక్కుంటే వ‌లంటీర్లు ప్ర‌భుత్వంతో క‌లిసి నిస్వార్థ్యంగా సేవలందించారు. ఇంకోసారి వ‌లంటీర్లపై పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారని అని హెచ్చరించింది మంత్రి రోజా.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...