Home Special Looks సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న అందాల తారలు!
Special Looks

సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్న అందాల తారలు!

Actresses Who Got Married Secretly

తమ అందాలతో అభిమానులని ఎంతగానో ఆకర్షించే తారలు కూడా ఏదోక రోజు పెళ్లి చేసుకోవాల్సిందే. తమని అంతలా అట్రాక్ట్ చేసే సినీ తారలు ఎవరిని పెళ్లి చేస్కుంటారో తెలుసుకోవాలి అన్న ఆలోచన, ఆసక్తి చాలా మందికి ఉంటుంది. కానీ, ఏవేవో కారణాల వల్ల ఆ తారలు తాము చేసుకోబోతున్న వాళ్ళ వివరాలను పబ్లిక్ కి తెలియకుండా చూసుకుంటారు. కొందరు అప్పటికే పెళ్ళయిన వాళ్ళని ప్రేమించడం వల్ల ఎవ్వరికీ చెప్పకపోతే, మరికొందరు తమ ఇళ్ళలో ఒప్పుకోలేదని ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎవ్వరికీ తెలీకుండా కూడా పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు. అలా చేసిన వాళ్ళ కొందరి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ముందుగా మనం ప్రస్తావనకి తీసుకురావాల్సిన వ్యక్తి మన వెండి తెరమీద ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి గారి గురించి. ఆమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఐన బోనీ కపూర్ ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ, బోనీకి అప్పటికే పెళ్ళయిపోయి ఉండటంతో ఈ పెళ్ళిని చాలా రహస్యంగా చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకి బెంగాల్ కి చెందిన బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తితో పెళ్లి చేసుకుని మూడేళ్లు కలిసి ఉన్నట్టు పుకార్లు ఉన్నాయి. అందులో 100% నిజం లేకపోయినా.. ఆయనతో శ్రీదేవి రిలేషన్ సాగించింది అనేది చాలావరకు నిజం. తర్వాత మహానటి సావిత్రి గురించి చూస్తే.. ఆమె కూడా చెన్నైకి చెందిన తమిళ నటుడు జెమినీ గణేశన్ ని ఇష్టపడి ఎవ్వరికీ తెలీకుండా పెళ్లి చేసుకుంది. ఎందుకంటే ఆయనకి కూడా అప్పటికే పెళ్ళయిపోయింది.

ఇప్పుడు మరో పాపులర్ పాత నటి జయప్రధ గురించి మాట్లాడుకోవాలి. ఆమె తెలుగు లేడీ అయినప్పటికీ.. ఇక్కడ వచ్చిన ఫేమ్ తో బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టగలిగింది. అక్కడ.. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన శ్రీకాంత్ నహతా అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న జయప్రధ తన మ్యారేజ్ ని సీక్రెట్ గానే కానిచ్చింది. ఎందుకంటే ఇక్కడ కూడా ఆమె చేసుకున్న వ్యక్తికి అప్పటికే పెళ్లయిపోయి ఉంది. అలాగే తమిళ నటి దేవయాని కూడా ప్రేమ వివాహమే చేసుకుంది. రాజకుమారన్ అనే వ్యక్తిని ప్రేమించడంతో.. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదట. ఇక అక్కడినుంచి వెంటనే వెళ్ళిపోయి.. దేవయాని ఆ తమిళ డైరెక్టర్ ని పెళ్లి చేసేసుకుంది. మరో వ్యక్తి జర్నీ సినిమాలో నటించిన అనన్య. తను కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లాడింది.

అలాగే సీనియర్ క్యారెక్టర్ ఆరిస్ట్ సీత కూడా పార్తీబన్ అనే వ్యక్తితో ప్రేమలో పడి తర్వాత తర్వాత సీరియల్ నటుడు సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఐతే, విషయం ఏంటంటే ఆ పెళ్లి కూడా బ్రేక్ అయింది. శ్రియ కూడా 2018 లో ఒక రష్యన్ టెన్నిస్ ప్లేయర్ ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అతని గురించి మీడియాకి ఏ మాత్రం తెలియకుండా జాగ్రత్తపడింది. ఇక రాణీ ముఖర్జీ కూడా ఆదిత్య చోప్రాని రహస్యంగానే పెళ్లి చేసుకుందన్నమాట. ఇలా చాలా మంది అందాల తారలు పెళ్ళిళ్ళు అలా కానిచ్చారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...