Home Film News Mega Princess: మెగా ప్రిన్సెస్‌కి ఎన్టీఆర్ దంప‌తులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!
Film News

Mega Princess: మెగా ప్రిన్సెస్‌కి ఎన్టీఆర్ దంప‌తులు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

Mega Princess: టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో చిరంజీవి-నాగార్జున మ‌ధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉందో మ‌నంద‌రికి తెలిసిందే. అలాగే రామ్ చ‌రణ్‌-జూనియ‌ర్ ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. ఈ ఇద్దరు క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేయ‌గా, ఈ మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో మ‌నం చూశాం. ఇక ఈ మూవీ  ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో ఒక‌రిపై ఒక‌రు త‌మ ప్రేమ‌ని తెలియ‌జేశారు. రెండు  కుటుంబాల మధ్య ఏ వేడ‌క జరిగినా.. విష్ చేసుకోవడంతో పాటు.. బహుమతులు కూడా పంపించుకోవడం చేస్తారు.

జూన్ 20న రామ్ చరణ్, ఉపాసన తల్లి తండ్రులు అయ్యారు. వార‌సురాలు రాక‌తో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. ఇక చరణ్, ఉపాసనల గారాల పట్టీకి క్లింకారా అని పేరు పెట్టగా,   లలిత సహస్రనామాలలోని బీజాక్షరాన్ని పేరుగా పెట్టినట్టు తెలియ‌జేశారు. ఇక క్లింకార‌కి ఇండ‌స్ట్రీ నుండి చాలా మంది ప్ర‌ముఖులు స్ట‌న్నింగ్ గిఫ్ట్‌లు పంపించారు. అలియా భ‌ట్ ప్ర‌త్యేక డ్రెస్ పంపించ‌గా, ముకేష్ అంబానీ అయితే ఏకంగా బంగారు ఊయ‌ల పంపించిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన బ‌హుమ‌తి గురించి సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క్లింకారా కోసం..  జూనియ‌ర్ ఎన్టీఆర్ గోల్డ్ డాలర్స్ ను బహుమతిగా పంపించారని  స‌మాచారం.

గోల్డ్  డాలర్స్ మీద రామ్ చరణ్, ఉపాసన, క్లింకారాల పేర్లు వచ్చేలా తార‌క్  ప్రత్యేకంగా డిజైన్ చేయించి వారికి బ‌హుమ‌తిగా అందించాడ‌ట‌. ఈ బహుమతితో మెగా ఫ్యామిలీ ఫుల్  ఖుషీ అయ్యారట. ఇక‌ రామ్ చరణ్ కు పాప పుట్టగానే తారక్ అతనికి ఫోన్ చేసి విష్ చేశార‌ని సమాచారం.మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా తార‌క్ విషెస్ తెలియ‌జేశాడు. త్వ‌ర‌లో వీరిద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల‌ని మ‌రోసారి అల‌రించ‌బోతున్నట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ పై ఇటీవ‌ల విజ‌యేంద్ర ప్రసాద్ కామెంట్ చేయ‌డంతో ఈ ఇద్ద‌రు మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం పంచ‌నున్నట్టు అర్ధ‌మ‌వుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...