Home Film News Priyamani: ముద్దు సీన్స్ లో నటించకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రియమణి..!
Film News

Priyamani: ముద్దు సీన్స్ లో నటించకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రియమణి..!

Priyamani: ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లో న‌టిస్తుంది. మంచి మంచి పాత్ర‌లు ఎంచుకుంటూ ప్రేక్ష‌కులకి వినోదాన్ని పంచుతుంది. మ‌రోవైపు బుల్లితెర‌పై జ‌డ్జిగా కూడా సంద‌డి చేస్తుంది. 2003లో ఎవరే అతగాడు అనే చిత్రంతో సిల్వర్‌ స్క్రీన్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార‌…ఆనతికాలంలోనే అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు ప్ర‌ఖ్యాత‌లు దక్కించుకుంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం ఇలా ప‌లు భాష‌లలో న‌టించి స‌త్తా చాటింది.ఇటీవ‌ల నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీలో నటించి తన అద్భుత నటనతో త‌న అభిమానుల‌ని మంత్ర ముగ్ధుల‌ని చేసింది. అయితే ఈ అమ్మ‌డు కెరీర్ స్టార్టింగ్‌లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌లో న‌టించిన‌, ఇప్పుడు మాత్రం పూర్తిగా న‌ట‌న‌కి ప్రాధాన్య‌త ఉన్న చిత్రాలే చేస్తుంది.

త‌న వ‌య‌స్సుకి  తగ్గ సినిమాలు చేస్తూ అద్భుతమైన నటిగా నిరూపించుకుంటూ వ‌స్తుంది ప్రియ‌మ‌ణి.  అయితే ‘నో-కిస్’ పాలసీని పాటిస్తున్న ప్రియ‌మ‌ణి అందుకు గ‌ల కార‌ణాలు తాజాగా చెప్పుకొచ్చింది. 2017లో నాకు పెళ్లి కాగా, అప్ప‌టి నుండి   ముద్దు సన్నివేశాల్లో నటించలేదు. సినిమా ఓకే చేసేముందే మేక‌ర్స్‌కి ఈ విషయాన్ని చెబుతున్నాను. ఇప్పుడు నేను చేసే  సినిమాలను మా ఇరు కుటుంబ సభ్యులు చూస్తారు. కిస్ సీన్స్ లాంటి వ‌ల్ల‌ వాళ్లు ఇబ్బందిగా ఫీలవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ప్రియ‌మ‌ణి తెలియ‌జేసింది.ప్ర‌స్తుతం నేను నా  భర్తకు జవాబుదారీగా ఉన్నందున మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం కొంత అసౌకర్యంగా ఉంటుంద‌ని చెప్పింది.

ఇలాంటి ఆఫ‌ర్స్ త‌న‌కు చాలా వ‌చ్చాయని చెప్పిన ప్రియ‌మ‌ణి వాట‌న్నింటిని రిజెక్ట్ చేసింద‌ట‌. వెండితెర‌పై బుగ్గలపై ముద్దు వరకు ఓకే గానీ.. అంతకుమించి చేయకపోవడం తన పర్సనల్ చాయిస్ అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు  మణిరత్నం రూపొందించిన ‘రావణ్‌’ మూవీతో బాలీవుడ్‌కు కూడా ప‌రిచ‌య‌మైంది. ఇక‌ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో షారుఖ్‌తో కలిసి ఐటెం సాంగ్‌లో అద‌ర‌గొట్టింది.  ఇక ఆ మ‌ధ్య వ‌చ్చిన‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తనకు మంచి పేరు తీసుకొచ్చిపెట్టింది.. ప్రస్తుతం ప్రియ‌మ‌ణి ‘మైదాన్, జవాన్’ చిత్రాల్లో నటిస్తోంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...