Home Film News Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!
Film News

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. ఇటీవ‌ల మ‌యోసైటిస్ చికిత్స కోసం సినిమాల‌కి దూరంగా ఉంటుంది స‌మంత‌. ఒక‌వైపు విడాకుల‌తో మాన‌సికంగా కుంగిపోయిన స‌మంత‌ని మ‌యోసైటిస్ మ‌రింత కుంగ‌దీసింది. అయితే వాటిని స‌మంత ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే ఇప్పుడు స‌మంత‌ని ఆమె మేనేజ‌ర్ మోసం చేశాడ‌నే వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది. మేనేజ‌ర్స్ సెల‌బ్రిటీల‌కి   దిశానిర్ధేశకులు కాగా, వారి చెప్పినట్టే వీరు ఫాలో అవుతుంటారు. అయితే తాజాగా స‌మంత మేనేజ‌ర్ ఆమెని మోసం చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

కొద్ది రోజుల క్రితం   రష్మిక మందన్నా మేనేజర్‌ విషయంలో మోసపోయిందనే వార్త సంచలనంగా మారింది. ఇప్పుడు సమంత మేనేజర్‌ కూడా మోసం చేశాడని, ఏకంగా కోటి రూపాయలు నొక్కేసేందుకు స్కెచ్‌ వేశాడ‌ని ఫిలిం న‌గ‌ర్ లో ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. కాగా, స‌మంత న‌టించిన ఖుషి చిత్రం నేడు విడుద‌ల కానుండ‌గా,  ఈ సినిమాని   మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన‌, ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సమంతకి మయోసైటిస్‌ వ్యాధి రావ‌డంతో ఆమ‌ పూర్తిగా ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. మూడు నాలుగు నెలలు షూటింగ్‌ ఆపేయడం నిర్మాతలకు పెద్ద భారమైన విషయం కాగా, ఇది గ్ర‌హించిన స‌మంత   తాను తీసుకునే పారితోషికంలో కోటీ రూపాయలు తగ్గించాలని మేనేజ‌ర్‌కి చెప్పింద‌ట‌.

అయితే స‌మంత ఇప్పుడు ప్ర‌స్తుతం అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంది కాబ‌ట్టి, ఆమె ఈ విష‌యాల‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోద‌ని భావించిన మేనేజ‌ర్  నిర్మాతల నుంచి ఆమె పూర్తి పారితోషికం తీసుకున్నాడట. పైగా దాన్ని లిక్విడ్‌ క్యాష్‌ రూపంలో తీసుకునేందుకు, ఆ కోటి రూపాయలు సమంతకి తెలియకుండా నొక్కేయాల‌ని భావించిన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ విష‌యంలో నిర్మాత‌లు లిక్విడ్ క్యాష్ ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌డంతో   అతను తన ఫ్రెండ్స్ అకౌంట్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేసాడ‌ని టాక్. ఈ విష‌యం గురించి స‌మంత‌కి నిర్మాత‌లు తెలియ‌జేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇప్పుడు ఆమె త‌న మేనేజ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధ‌మైందని టాక్.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Ravi Kumar: వాడొక హీరోనా అంటూ ఆ డైరెక్ట‌ర్ అంత దారుణంగా అన్నాడేంటి..!

Ravi Kumar: ఇటీవ‌ల చాలా మంది త‌మ టాలెంట్‌తో క‌న్నా కాంట్ర‌వ‌ర్సీస్‌తో ఎక్కువ ఫేమ‌స్ అవుతున్నారు....