Home Film News Rakesh Master: తాను చనిపోతే త‌న శవాన్ని తాకొద్ద‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్‌ని హెచ్చ‌రించిన రాకేష్ మాస్ట‌ర్
Film News

Rakesh Master: తాను చనిపోతే త‌న శవాన్ని తాకొద్ద‌ని శేఖ‌ర్ మాస్ట‌ర్‌ని హెచ్చ‌రించిన రాకేష్ మాస్ట‌ర్

Rakesh Master: నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎంతో స‌ర‌దాగా ఉంటూ యూట్యూబ్ లో సంద‌డి చేస్తూ ఉండే రాకేష్ మాస్టర్ అకాల మ‌ర‌ణం చెందారు. ఆయ‌న వారం రోజుల క్రితం వైజాగ్ లో షూటింగ్‌ లో పాల్గొని, ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే ఆదివారం ఉదయం రాకేష్ మాస్ట‌ర్‌కి రక్త విరోచనాలు కావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూసారు. డయాబెటిక్, సివియర్ మెటబాలిక్ ఎసిడోసిస్ కావడంతో రాకేశ్ మాస్టర్‌ మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయ‌ని వైద్యులు తెలిపారు. ఆయ‌న మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు.

రాకేష్ మాస్ట‌ర్ ఒక‌ప్పుడు మంచి సినిమాల‌కి కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘దేవదాసు’, ‘చిరునవ్వుతో’, ‘సీతయ్య’, ‘అమ్మో పోలీసోళ్ళు’ వంటి హిట్‌ చిత్రాలకు రాకేశ్‌ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు.  ఇండ‌స్ట్రీలో టాప్ కొరియోగ్రాఫ‌ర్స్ గా ఉన్న శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌ లాంటి వారికి రాకేష్ మాస్ట‌ర్‌ శిక్షణ ఇచ్చాడు. అయితే శేఖ‌ర్, రాకేష్‌ల మ‌ధ్య  కొన్నాళ్లుగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య గొడవ ఎప్పుడు ఎలా మొద‌లైందంటే.. చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీలో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ విషయం శేఖర్ మాస్టర్ త‌న‌కు చెప్ప‌కుండా చేశాడ‌ని రాకేష్ ఆరోప‌ణ‌.

శేఖ‌ర్ మాస్ట‌ర్ కోసం నేను ఎన్నో బాధ‌లు ప‌డ్డాను. వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే, వారి త‌ల్లిదండ్రుల‌ని క‌లిసి పెళ్లి చేయ‌మ‌ని అడిగాం. వారు సినిమా వాళ్ల‌కు ఇవ్వ‌మ‌ని చెప్పారు. అయితే శేఖ‌ర్‌కి అప్ప‌ట్లో..మ‌నం ప‌రస్ప‌రం అబ‌ద్ధాలు చెప్పుకోవ‌ద్దు అని అన్నాను. చిరంజీవి సినిమా ఛాన్స్ వ‌చ్చింద‌ని త‌న భార్య‌కి చెప్పాడు కాని నాకు చెప్ప‌లేదు. వాడిని జీవితంలో క‌ల‌వ‌ను. నేను చ‌చ్చిన కూడా నా శవాన్ని కూడా వాడు తాకొద్దు అని రాకేష్ అన్నారు. అయితే రాకేష్ కామెంట్స్ కి శేఖర్ మాట్లాడుతూ..  తాగి మా అమ్మను తిట్టాడు. నా భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు అని అన్నాడు. ఈ క్ర‌మంలోనే   శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్  మ‌ధ్య దూరం పెరిగింద‌ని టాక్.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...