Home Film News Sai Tej: నిహారిక‌ని తిట్టిన నెటిజ‌న్.. నోరు మూసుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తేజ్
Film News

Sai Tej: నిహారిక‌ని తిట్టిన నెటిజ‌న్.. నోరు మూసుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తేజ్

Sai Tej: మెగా డాట‌ర్ నిహారిక విడాకులు ఇంత హాట్ టాపిక్ అయిందో మ‌నంద‌రికి తెలిసిందే. అట్ట‌హాసంగా కొన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టి అంగ‌రంగ వైభ‌వంగా త‌న కూతురు నిహారిక పెళ్లి జరిపించాడు నాగ‌బాబు. వైవాహిక జీవితంలో తాను ఎంతో సంతోషంగా ఉంటుంద‌ని ఆ తండ్రి ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. కాని ప‌ట్టుమ‌ని రెండేళ్ల‌కే నిహారిక త‌న భ‌ర్తకి విడాకులు ఇచ్చి అంద‌రికి షాకిచ్చింది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల్ల‌నే వారిరివురు విడాకులు తీసుకున్నార‌ని స‌మాచారం. అయితే విడాకుల త‌ర్వాత చాలా మంది నిహారిక‌నే ట్రోల్ చేశారు. అత్తింట్లో అడ్జ‌స్ట్ కాలేక‌, భ‌ర్త పెట్టిన కండీష‌న్స్‌కి ఓకే చెప్ప‌లేక విడాకులు తీసుకుంద‌ని ఆమె దారుణంగా తిట్టిపోసారు. అవ‌న్నీ భ‌రిస్తూ నిహారిక మౌనంగానే ఉంది. తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఓ కామెంట్ పెట్టగా, దానికి నెటిజ‌న్ షాకింగ్ కామెంట్ చేశాడు. దానికి సాయిధ‌ర‌మ్ తేజ్ అత‌నికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిప‌డేశాడు.

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ బైక్ ప్ర‌మాదం నుండి కోలుకున్న త‌ర్వాత వ‌రుస చిత్రాలు చేస్తున్నారు. విరూపాక్ష చిత్రంతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన తేజ్ రీసెంట్‌గా  పవన్ కళ్యాణ్ తో కలసి బ్రో చిత్రంలో  క‌లిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై అభిమానుల‌తో పాటు తేజ్ కూడా భారీ హోప్స్ పెట్టుకున్నా కూడా  ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అయితే త‌న  మావయ్యతో కలసి ఓ సినిమా చేసాన‌నే సంతోషం తేజ్ లో ఉంది. ఇక ఇప్పుడు  సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయకృష్ణ కోసం ఓ ప్రయివేట్ సాంగ్ లో నటించాడు సాయి ధ‌ర‌మ్ తేజ్. స్వాతి రెడ్డితో కలసి సత్య అనే వీడియో సాంగ్ లో న‌టించ‌గా,ఇప్పుడు ఇది  యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది.
అయితే ఈ సాంగ్‌కి సంబంధించి తేజ్ కొద్ది రోజుల క్రితం ఓ అప్‌డేట్ ఇచ్చారు. అప్పుడు నిహారిక దానికి స్పందిస్తూ.. ఈ  సాంగ్ చూడడానికి చాలా  ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ కామెంట్ పెట్టింది. దానికి ఓ నెటిజన్ నిహారిక కామెంట్ కి బదులిస్తూ  ..వీటిపైన పెట్టిన ద్యాస ఫ్యామిలీపై పెట్టి ఉంటే బావుండేది అంటూ నిహారిక ప‌ర్స‌న‌ల్ లైఫ్ ప్ర‌స్తావిస్తూ కామెంట్ చేశాడు. దీనిపై సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ఫుల్ కోపం వ‌చ్చేసింది. వెంట‌నే  నోరు మూసుకో..ఆ  కామెంట్ డిలీట్ చెయ్ అంటూ ఆ ఆకతాయికి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చాడు. మరదలికి బావ ఇలా అండ‌గా నిలబడడంతో తేజుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మ‌రోవైపు సదరు నెటిజన్ కూడా  ఆ కామెంట్ ని వెంటనే డిలీట్ చేయగా,  తేజు కూడా తన వార్నింగ్ ని రిమూవ్ చేసినట్లు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...