Home Film News Tollywood: సినీ ఇండస్ట్రీలో పెళ్లి కానీ హీరోలు వీరే.. వారు ఎందుకు చేసుకోలేదంటే..!
Film News

Tollywood: సినీ ఇండస్ట్రీలో పెళ్లి కానీ హీరోలు వీరే.. వారు ఎందుకు చేసుకోలేదంటే..!

Tollywood: పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ మరపురాని తరుణం అంటారు. మరి అలాంటి పెళ్లి అవ్వాల్సిన వయస్సులోనే జరగాలి. ప్రతి మనిషికి మరొక మనిషి తోడు ఉండాలి. వారిద్దరి కలిసి నిండు నూరేళ్లు బ్రతకాలి. మరి సెలెబ్రిటీల్లో ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గా ఉండిపోయినవాళ్లేవరో ఇప్పుడు చూద్దాం. అసలు వీళ్లు ఇంకా పెళ్లెందుకు చేసుకోవట్లేదో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఆయన దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ప్రజంట్ వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కు ప్రజంట్ 45 ఏళ్లు. ఇప్పటివరకు ఆయన పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. తన పెళ్లికి సంబంధించి ప్రశ్న అడిగినప్పుడు నేను మ్యారీడ్ లైఫ్ ను మెయింటైన్ చేయలేను.. అది నా వల్ల కాదని సమాధానం చెప్పారు. ఇక రీసెంట్ గా ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని అన్నారు.

నెక్ట్స్ సిద్ధార్థ్. బొమ్మరిల్లు సినిమాతో హైప్ తెచ్చుకున్నారు. సిద్ధార్థ్ కు మేఘన అమ్మాయిని 2003 లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2007 లో డైవర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత శృతి హాసన్, సమంతతో డేటింగ్ చేసి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నా కాని కుదర్లేదు. నెక్ట్స్ విజయ్ దేవరకొండ.. ప్రజంట్ ఈయన వయస్సు 35 సంవత్సరాలు. ప్రజంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈయన పెళ్లికి ఇంకాస్త టైమ్ ఉందంటూ ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. పీపుల్స్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్. నారాయణ మూర్తి 70 ఏళ్లైనా ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారు.

ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం తాను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించానని, వాళ్ల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో సింగిల్ గా ఉండిపోయానని అన్నారు.ఇంకా తెలుగు, తమిళంలో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో విశాల్. ఈయన కూడా అనీషా అనే అమ్మాయిని ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత పలు కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగిల్ గానే ఉన్నారు. ఇక బాలీవుడ్ లో బడా స్టార్ అయిన సల్మాన్ ఖాన్ సైతం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. నెక్ట్స్ అక్కినేని వారసుడు నాగచైతన్య కూడా సామ్ తో విడాకులు అయ్యాక ఒంటరిగానే ఉంటున్నారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...