Home Film News Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి మొటిమ‌ల వెన‌క క‌హానీ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!
Film News

Sai Pallavi: సాయి ప‌ల్ల‌వి మొటిమ‌ల వెన‌క క‌హానీ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sai Pallavi: త‌న న‌ట‌న‌తో లేడి ప‌వ‌ర్ స్టార్‌గా గుర్తింపు గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్ల‌వికి అనేక భాష‌ల‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ అమ్మ‌డు ఆచితూచి సినిమాల‌ని ఎంపిక చేసుకుంటుంది. క‌థ న‌చ్చ‌క‌పోతే ఎంత‌టి పెద్ద హీరో సినిమా అయిన నో చెప్పేస్తుంది. చిరంజీవి భోళా శంక‌ర్ చిత్రంలో ముందుగా సిస్ట‌ర్ పాత్ర కోసం కీర్తి సురేష్‌ని సంప్ర‌దించ‌గా, ఆమె సింపుల్ గా నో చెప్పేసింది. ఒక ప్ర‌భాస్ రాజా డీల‌క్స్ చిత్రం కోసం కూడా సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించిన‌ట్టు టాక్ న‌డించింది. అయితే ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకి కూడా ఈ అమ్మడు నో చెప్పిన‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది.

ఆ మ‌ధ్య వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేసిన సాయి ప‌ల్ల‌వి రీసెంట్‌గా గార్గి సినిమాతో ప‌ల‌కరించింది. ఈ సినిమా అంతా తన భుజాల మీద మోసింది. గార్గి లాంటి హార్ట్ టచింగ్, హంటింగ్ క్లైమాక్స్‌ను ఎవ్వరూ ఊహించి ఉండరు. క్లైమాక్స్‌లో సాయి పల్లవి నటనకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు.కాని సినిమా ఎందుకో క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యం సాధించ‌లేదు.  ఓటీటీలో మాత్రం ఈ సినిమా అద‌రగొట్టేసింది. ఇక ఈ సినిమా త‌ర్వాత సాయి ప‌ల్లవి నుండి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. ఆమె సినిమా కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సాయి ప‌ల్లవి సినిమాలు చేయ‌క‌పోయిన ఆమెకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది.

సాయి ప‌ల్ల‌విని ఒక టాప్ బ్రాండ్ ఫెయిర్నెస్ క్రీమ్ కోసం యాడ్ లో నటించమని అడిగితే అందుకు నో చెప్పింద‌ట‌. అందుకు కార‌ణం కూడా చెప్పింది. తాను చ‌ద‌వుకునే స‌మ‌యంలో అంద‌రు అందంగా, ఫెయిర్ గా ఉండ‌గా, సాయి ప‌ల్ల‌వి మాత్రం అంద‌విహీనంగా ఉండేదానిని ఫీల‌య్యేద‌ట‌. త‌ను న‌టించిన ప్రేమ‌మ్ సినిమాలో కూడా సాయి ప‌ల్ల‌వి చాలా భ‌య‌ప‌డింద‌ట‌. కాని ప్రేమమ్ సినిమా తర్వాత  త‌న న‌ట‌న‌నే అంద‌రు చూశార‌ని, ముఖాన్ని ఎవ‌రు చూడలేద‌ని అప్పుడు చాలా కాన్ఫిడెంట్ వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చింది. ఎంసీఏ, శ్యాం సింగరాయ్, విరాటపర్వం, లవ్ స్టోరీ, ఫిదా  వంటి చిత్రాల‌తో సాయి ప‌ల్లవి టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఆమె మేకప్ వేసుకోవ‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌న‌ని ప‌లు సంద‌ర్భాల‌లో  చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...