Home Film News Rajasekhar: రాజశేఖర్ ను పెళ్లాడాల్సిన శ్రీదేవి.. ఎవరు చెడగాట్టారంటే..?
Film News

Rajasekhar: రాజశేఖర్ ను పెళ్లాడాల్సిన శ్రీదేవి.. ఎవరు చెడగాట్టారంటే..?

Rajasekhar: శ్రీదేవి.. సిని ఇండస్ట్రీకి ఆమె ఒక అతిలోక సుందరి. సౌత్, నార్త్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, అభినయంతో ఎంతోమందిని మంత్ర ముగ్దుల్ని చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ లో అగ్రహీరోలకు జోడీగా నటించింది. ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళంతో పాటు హిందీ, మలయాళంలోనూ నటించి మెప్పించింది. జూన్ 2 వ తేదీన 1996 లో శ్రీదేవి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనికపూర్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించింది. అయితే వీరికి ఇద్దరు అమ్మాయిలు. చాలా సంతోషంగా సాగిపోతున్న శ్రీదేవి జీవితంలో అనుకోకుండా 2018 వ సంవత్సరంలో ఫిబ్రవరి 14 న దుబాయ్ లోని ఓ హోటల్ లో మరణించింది.

ఆమె మరణ వార్త విని ఎంతో మంది అభిమానులు, సినీ నటీనటులు కన్నీరు పెట్టుకున్నారు. తీరని శోకంలో మునిగిపోయారు. నిజానికి శ్రీదేవిని మొదట హీరో రాజశేఖర్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. రాజశేఖర్ వాళ్ల నాన్న.. శ్రీదేవి తండ్రి స్నేహితులు. వీరిద్దరూ దూరపు బంధువులు కూడా. అందుకే వీళ్లిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నారట. కానీ శ్రీదేవి ఓ పక్క సినీ రంగంలో దూసుకుపోతుంది. వరుస అవకాశాలతో అగ్రస్థానంలో ఉంది. రాజశేఖర్ అప్పటికీ సినిమాల్లోకి రాలేదు. డాక్టర్ కోర్సు చదువుతున్నారు. ఇదే టైమ్ లో శ్రీదేవి వాళ్ల నాన్న రాజశేఖర్ వాళ్ల కుటుంబంతో వారి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి.. తన మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టారట.

 

కానీ రాజశేఖర్ తో శ్రీదేవి పెళ్లికి రాజశేఖర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఒప్పుకోలేదట. రాజశేఖర్ ను ఎమ్మెస్ చేయించాలని అనుకుంటున్నామని అన్నారు. అలాగే ఇప్పట్లో అతనికి పెళ్లి చేయాలనే ఆలోచన లేదని చాలా తేలికగా మోహం మీదే చెప్పారట. కానీ రాజశేఖర్ ఫ్యామిలీ మెంబర్స్ సినిమాల్లో నటించే అమ్మాయని అందుకే వాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు అనే భయంతోనే అలా చెప్పారట. అయితే ఆ తర్వాత రాజశేఖర్ సినిమాల్లోకి రావడం.. జీవితను ప్రేమించడం జరిగాయి. జీవితను కూడా పెళ్లి చేసుకునేందుకు మొదట్లో వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ రాజశేఖర్ గట్టి పట్టుదలతో నిలబడేసరికి వీరిద్దరి పెళ్లికి ఒప్పుకున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...