Home Film News Mahesh Babu: మ‌హేష్ ప‌క్క‌న ఉన్న ఈ న‌టి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!
Film News

Mahesh Babu: మ‌హేష్ ప‌క్క‌న ఉన్న ఈ న‌టి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుత‌ది..!

Mahesh Babu: ఒక్కోసారి సినిమాల‌లోని కొన్ని పాత్ర‌లు అలా వ‌చ్చి ఇలా వెళ‌తాయి. కాని వారు ప్రేక్ష‌కుల‌కి ఇట్టే క‌నెక్ట్ అయిపోతుంటారు. వారి గురించి తెగ ఆరాలు తీస్తుంటారు. వారి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందిన సర్కారు వారి పాట చిత్రంలోని కీర్తి ఫ్రెండ్ గురించి కొన్ని విష‌యాలు రాబ‌ట్ట‌గా, ఇప్పుడు ఇవి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. స‌ర్కారు వారి పాట అనే చిత్రం పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్క‌గా, ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో మ‌హేష్ బాబు డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌డ‌మే కాకుండా తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇక కీర్తి సురేష్ కూడా త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌హో అనిపించింది. అయితే ఇందులో కీర్తిసురేష్ ఫ్రెండ్ గా నటించిన ఓ అమ్మాయి కూడా ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. అయితే ఆ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే బిత్త‌ర‌పోవ‌డం ఖాయం. ఆమె పేరు సౌమ్య మీనన్ కాగా, మోడలింగ్ నుంచి నటిగా మారింది ఈ బ్యూటీ. మహేష్ బాబు తో నటించాలన్న ఆశ త‌న‌లో ఎంతో ఉండ‌గా, సర్కారు వారిపాట సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ మూవీలో చిన్న పాత్రలో కనిపించిన కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈమె గతంలో మలయాళం ఇండస్ట్రీలో కినవల్లి, ఫ్యాన్సీ డ్రెస్, చిల్డ్రన్స్ పార్క్.. లాంటి సూపర్ హిట్ సినిమాలలో క‌థానాయిక‌గా న‌టించింది.

 

అయితే తెలుగు సినిమాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ పోషిస్తుండ‌డం గ‌మ‌న‌ర్హం. ఈ మ‌ధ్య సౌమ్య మీనన్ పుట్టిన రోజు కాగా, ఆ రోజు తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. సర అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు పేర్కొంది. వి.శశిభూషణ డైరెక్షన్‌లో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, సౌమ్య రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుంది. విభిన్నమైన కథాంశం ఉన్న కథతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో సౌమ్య పాత్ర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచ‌నుంద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...