Home Film News Salaar: స‌లార్ మూవీ టీజ‌ర్‌పై నెగెటివ్ ప్ర‌చారం.. ‘డిజప్పాయింటెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌లోకి..!
Film News

Salaar: స‌లార్ మూవీ టీజ‌ర్‌పై నెగెటివ్ ప్ర‌చారం.. ‘డిజప్పాయింటెడ్’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్‌లోకి..!

Salaar: ఆదిపురుష్ చిత్రం త‌ర్వాత ప్రభాస్ నుండి వ‌స్తున్న చిత్రం స‌లార్. కేజీఎఫ్ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన ప్ర‌శాంత్ నీల్ ఇప్పుడు ప్ర‌భాస్‌తో సలార్ చిత్రం చేస్తున్నాడు. గ‌త కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేసే ఆలోచ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మూవీ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఈ రోజు ఉద‌యం చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా,ఈ టీజ‌ర్ విడుద‌లైన కొద్దిగంట‌ల‌లోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మిలియ‌న్ వ్యూస్ రాబ‌ట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. చిత్ర టీజర్‌ రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది.

ఒక‌వైపు సలార్ టీజ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంటే మ‌రోవైపు దీనిపై నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆదిపురుష్ టీజ‌ర్‌కి ఎలా నెగెటివిటీ వ‌చ్చిందో ఇప్పుడు స‌లార్ టీజ‌ర్‌పై కూడా అలా నెగెటివ్ ప్ర‌చారం చేస్తున్నారు. `సలార్‌` టీజర్ ఏమాత్రం బాగాలేదని, అంచాలను అందుకోలేకపోయిందని, ప్ర‌భాస్‌ని స‌రిగ్గా చూపించ‌లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే `డిజప్పాయింట్‌` అనే ట్యాగ్‌ని సోషల్‌ మీడియాలో తెగ‌ ట్రెండ్‌ చేస్తున్నారు. `సలార్‌ డిజప్పాయింట్‌` అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది. మరి కొంద‌రు మాత్రం ప్ర‌శాంత్ నీల్ త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌జెంట్ చేశాడని, బీజీఎం కూడా అదిరిపోయింద‌ని చెప్పుకొస్తున్నారు.

 

టీజ‌ర్‌లో విజువ‌ల్స్ అంత క్లారిటీ లేవ‌ని, వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీగా లేవని అంటున్నారు. `సలార్‌` పై భారీ అంచ‌నాలు పెట్టుకోగా, ఇప్పుడు ఇలా నెగెటివ్ టాక్ రావ‌డం ఫ్యాన్స్‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇక దీనిని రెండు పార్ట్‌లుగా రూపొందిస్తున్న‌ట్టు టీజ్ ద్వారా హింట్ ఇచ్చారు ప్ర‌శాంత్ నీల్. బాహుబ‌లి త‌ర్వాత వ‌రుస ఫ్లాపుల‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ప్ర‌భాస్‌కి ఈ సినిమా హిట్ త‌ప్ప‌నిస‌రి. లేదంటే మ‌నోడి ప‌రిస్థితి దారుణంగా మారుతుంది. దాదాపు 400కోట్లతోహోంబ‌లే సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్నారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...