Home Film News Nagababu: మా అమ్మ‌ది ఆ కుల‌మైతే గ‌ర్వంగా చెప్పుకునే వాళ్లం.. నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్
Film News

Nagababu: మా అమ్మ‌ది ఆ కుల‌మైతే గ‌ర్వంగా చెప్పుకునే వాళ్లం.. నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్

Nagababu: ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వ‌చ్చారో ఆయ‌న‌పై వైసీపీ నాయ‌కులు దారుణ‌మై విమ‌ర్శ‌ల‌కి దిగుతున్నారు. ప‌వ‌న్‌ని ఒక్క‌డిని మాత్ర‌మే కాకుండా ఆయ‌న ఫ్యామిలీపై కూడా కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై ప‌లు సంద‌ర్భాల‌ల‌లో ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నేను కూడా మీ ఫ్యామిలీ గురించి బ‌హిరంగంగా విమ‌ర్శించ‌గ‌ల‌ను. కాని నాకు సంస్కారం అడ్డు వ‌స్తుంద‌ని అన్నారు. అయితే ఇన్నాళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ ఆయ‌న కుంగ‌దీయాల‌ని చూసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు ప‌వ‌న్ త‌ల్లి కులం ప్ర‌స్తావ‌న తెచ్చి రాజ‌కీయం అంటే ఇంత అస‌హ్యంగా ఉంటుందా అనేలా చేస్తున్నారు.

ఇటీవ‌ల వైసీపీ.. పవన్ కళ్యాణ్ తల్లి రెల్లి కులస్తురాలంటూ ప్రచారం చేయిస్తుండ‌గా, దానిపై జనసేన  పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పందించారు. ‘గతంలోనే నా తమ్ముడు పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని స్వీకరిస్తానని బ‌హిరంంగా  చెప్పాడు. ఆ కులం అంటే  మాకు ఎంతో గౌరవం.  ఏ కులంలో పుట్టినా, వాళ్ళంతా తమ కులాన్ని గౌరవిస్తారు. మేం కూడా అంతే. నేను కాపు కులంలో పుట్టినందుకు గ‌ర్వ ప‌డుతున్నాను. మా అమ్మ‌ రెల్లి కులంలో పుట్టి ఉంటే మేం గర్వంగానే ఫీల్ అయ్యేవాళ్లం. గ‌ర్వ‌ప‌డాలి కూడా అని నాగ‌బాబు అన్నారు.

రెల్లి కులస్తులను అంద‌రు సఫాయి కార్మికులు అంటారని… వారు  సమాజంలోని కుళ్లుని, చెత్తని, నీచాన్ని శుభ్రం చేసి, మనకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తారు. వారికి మ‌నం అంద‌రం దండం పెట్టాలి.  ఒక తల్లి తన బిడ్డ విసర్జాన్ని కడిగి క్లీన్‌గా ఉంచుతుంది. కాని రెల్లి కుల‌స్తులు తమ బిడ్డలు కాకపోయినా ఈ సమాజం కోసం దాన్ని ఒక వృత్తిగా ఎన్నుకుని  వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. అలాంటి వాళ్లకు మనం చేతులెత్తి దండం పెట్టాలని అన్నారు. వైసీపీ వాళ్లకు రెల్లి కులస్తులంటే లోకువయిపోయింద‌ని నాగ‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘అరేయ్ పిచ్చోళ్లారా.. మా అమ్మ రెల్లి కులంలో పుట్టి ఉంటే బాధ పడంరా… సంతోషపడతాం రా .. మాకు కులం, జాతి అనే భేదాలు ఉండవని , అంద‌రిని స‌మానంగా చూసే సంస్కారాన్ని తమ తండ్రి నేర్పించారని  నాగబాబు స్ప‌ష్టం చేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...