Home BoxOffice మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా : ఇంద్రసేనారెడ్డికి 19 ఏళ్లు, ఎంత కలెక్ట్ చేసాడంటే..
BoxOffice

మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా : ఇంద్రసేనారెడ్డికి 19 ఏళ్లు, ఎంత కలెక్ట్ చేసాడంటే..

19 Years For Chiranjeevi Highest Grossing Indra

చిరంజీవి ఇద్దరు భామలతో జతకట్టి, ఫాక్షనిజం నేపథ్యంలో తీసిన సినిమా ఇంద్ర. ఎక్కడో కాశీకి వెళ్ళి అక్కడ ఒక సౌమ్యుడిగా బ్రతికేస్తున్న శంకర్ aka ఇంద్రసేనా రెడ్డి ఎలా తన గతం వైపుకి మళ్ళీ నడవాల్సి వచ్చింది అనేది ప్రధాన కథాంశం. పోకిరీ సినిమాలో ట్విస్ట్ లాగానే ఈ మూవీలో కూడా హీరో బ్యాక్ డ్రాప్ లో ఒక ఫాక్షన్ లీడర్ అని తెలియడం ప్రేక్షకులని ఉర్రూతలు ఊగించింది. అలాగే తన కాశీ పార్ట్నర్ సోనాలీ బింద్రే, రాయలసీమ పార్ట్నర్ ఆర్తీ అగర్వాల్ కూడా బాగా రాణించారు.

ఈ మూవీ చిన్నప్పటి ఇంద్రసేనా రెడ్డిగా నటించిన తేజ సజ్జా ఇప్పుడు హీరోగా మారాడు. జాంబీ రెడ్డి, ఇష్క్ వంటి సినిమాలు చేసి.. ప్రస్తుతం హనుమాన్ అనే సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. తేజకి ఈ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపుని తీసుకువచ్చింది. ఇంతకీ ఈ మూవీ బాక్సాపీస్ వద్ద ఎలా వర్క్ అవుట్ అయిందో చూద్దాం.

ముందుగా అనుకున్నట్టే సినిమా పెద్ద హిట్. 2002 లో వచ్చిన ఈ మూవీకి అప్పట్లో 10 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. మొత్తానికి 40 కోట్లకు పైగానే సంపాదించి ఆ టైమ్ కి ఈ స్థాయిలో డబ్బు సంపాదించిన మొదటి సౌత్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ కొట్టింది. సినిమా సక్సెస్ చూసిన ఇతర భాషల పరిశ్రమలు.. ఇంద్రాని తమ తమ భాషల్లోకి అనువదించుకున్నాయి. హిందీలో ఇంద్ర : ది టైగర్ గా, తమిళ్ లో ఇందిరన్ గా, భోజ్ పురిలో ఏక్ షేర్ గా డబ్ అయి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....