Home Film News YCP: వైసీపీ శ్రేణుల ఆగ్ర‌హంతో క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న సినీ స్టార్స్.. అస‌లు ఏం జ‌రిగింది..!
Film News

YCP: వైసీపీ శ్రేణుల ఆగ్ర‌హంతో క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న సినీ స్టార్స్.. అస‌లు ఏం జ‌రిగింది..!

YCP: ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయం ఎంత హాట్ హాట్‌గా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా అధికారిక ప్ర‌భుత్వం త‌మ‌పై ఎవ‌రు ఒక్క‌మాట అన్నా కూడా వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు.రీసెంట్‌గా టాలీవుడ్ ర‌చ‌యిత అనంత శ్రీరామ్‌కి వైసీపీ శ్రేణులు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. అందుకు కార‌ణం  వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ట్రోలింగ్ చేసిన పొలిటికల్ మిస్సైల్ పేజీ వెనుక ఈ ర‌చయిత ఉన్నాడ‌నే అనుమానం వారికి రావ‌డ‌మే . వైఎస్ఆర్‌ని విమ‌ర్శిస్తూ.. తెల్లని పంచె-మలినమైన మనసు మహానేత అంటూ కొన్ని ట్వీట్లు  సోష‌ల్ మీడియాలో పోస్ట్ కావ‌డంతో అది వైఎస్సార్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ పేజీని నిర్వహిస్తున్నది అనంత శ్రీరామ్ అని అత‌నిని దారుణంగా ట్రోల్ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స్పందించారు.

ఓ వీడియో రిలీజ్ చేసిన అనంత శ్రీరామ్..  వైఎస్ పై విమర్శలు, పోస్టులతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను వృత్తి రీత్యా అన్ని పార్టీలకు తాను పాటలు రాస్తుంటాను త‌ప్ప ఎవ‌రిని విమ‌ర్శించ‌లేదు. భవిష్యత్తులో రాజకీయాలపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తపర్చాల్సి వచ్చినా నిర్భయంగా తన అధికారిక సోషల్ మీడియా వేదికలపైనే ప్రకటిస్తాను తప్ప ఇత‌ర అకౌంట్స్ లో తెలియ‌జేయ‌ను. ప్ర‌స్తుతం నేను అమెరికాలో ఉన్నాను. అక్క‌డి నుండి వ‌చ్చాక  ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తానని అన్నాడు. అనంత శ్రీరామ్ క్లారిటీతో ఈ వివాదానికి తెర‌ప‌డింది.

ఇక జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోకి సంబంధించిన ప్రోమో ఒక‌టి విడుద‌ల కాగా, అందులో  బుల్లెట్‌ భాస్కర్‌ చెప్పిన పంచ్‌ డైలాగులు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా ఉన్నాయ‌ని, అవి వెంట‌నే తొల‌గించాలంటూ  వైసీపీ శ్రేణులు బుల్లెట్‌ భాస్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఏపీలో కొనసాగుతున్న వృద్ధ్యాప్య పెన్షన్‌ ను ఉద్దేశించి ప్రోమాలో డైలాగ్స్ ఉన్నాయ‌ని అత‌నిని నెట్టింట భారీగా ట్రోల్ చేసారు. ఈ క్ర‌మంలో  బుల్లెట్‌ భాస్కర్‌ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.  వైసీపీ శ్రేణులు, కార్యకర్తలందరికీ మా అమ్మ తరఫున నేను క్షమాపణలు చెబుతున్నాను. అది ఫ్లోలో అన్నదే  త‌ప్ప‌. ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చెప్పింది కాదు అని అన్నారు. ప్రోమోలో డైలాగులు డిలీల్‌ చేయమని ఇప్ప‌టికే మా టీం వాళ్లకు కూడా చెప్పాను. కాబట్టి  ఎపిసోడ్‌లో కూడా ఆ డైలాగులు అయితే ఉండవు. థ్యాంక్యూ. థ్యాంక్యూ సో మచ్‌’ అని  ఈ వివాదానికి ముగింపు ప‌లికేలా చేశాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...