Home Film News Niharika Marriage: నిహారిక పెళ్లి కోసం నాగ‌బాబు అన్ని కోట్లు ఖర్చు చేశాడా.. అదంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరేగా..!
Film News

Niharika Marriage: నిహారిక పెళ్లి కోసం నాగ‌బాబు అన్ని కోట్లు ఖర్చు చేశాడా.. అదంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరేగా..!

Niharika Marriage: ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. వ‌రుణ్ తేజ్ -లావ‌ణ్య త్రిపాఠి నిశ్చితార్థం అంద‌రిని ఆశ్చర్య‌ప‌ర‌చ‌డంతో పాటు మెగా అభిమానుల‌కి ఆనందం క‌లిగించింది. ఇక కొద్ది రోజుల‌కి రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన పండంటి కూతురికి జ‌న్మ‌నివ్వ‌డంతో మెగా ఫ్యామిలీ పేరు మ్రోగిపోయింది. ఈ రెండు శుభ‌వార్త‌ల‌తో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉండ‌గా, నిహారిక‌- చైత‌న్య విడాకుల వ్య‌వ‌హారం అంద‌రికి ఊహించ‌ని షాకిచ్చింది.జూన్ 5న వీరికి విడాకులు మంజూరు కాగా,జూలై 5న చైత‌న్య‌, నిహారిక విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి పెద్ద షాకిచ్చారు.పెళ్లి అయి క‌నీసం మూడేళ్లు కూడా కాకుండానే విడాకులు తీసుకోవ‌డ‌మేంట‌ని విమ‌ర్శిస్తున్నారు.

నిహారిక‌-చైత‌న్య‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చనీయాంశంగా మారింది. వీరిద్ద‌రికి సంబంధించికి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చల్ చేస్తున్నాయి.  నిహారిక జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీలో క‌ల‌వ‌లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే విడాకులు తీసుకోవ‌ల్చి వచ్చిందని కొంద‌రు అంటున్నారు.  అత్తవారింటి సాంప్రదాయం కట్టుబాట్లు అనేవి నిహారిక‌ని చాలా బాధ‌పెట్టాయ‌ని, ఆమె బాధను అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు సైతం విడాకులకి ఒప్పుకున్నార‌ని అంటున్నారు. అయితే నిహారిక పెళ్లి ఎంతో ఘ‌నంగా జ‌ర‌ప‌గా, ఇప్పుడు ఈ విడాకుల‌తో ఆయ‌న పెట్టిన ఖ‌ర్చంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయింది.

ఇప్పుడు నిహారిక పెళ్లికి నాగ‌బాబు ఎంత ఖ‌ర్చు పెట్టార‌నే విష‌యం హాట్ టాపిక్ అయింది. రాజస్థాన్లోని జైపూర్ ప్యాలెస్ లో  అంగ‌రంగ వైభ‌వంగా వారి వివాహం చేశాడు నాగబాబు. వీరి పెళ్లికి వేదికగా మారిన ఆ ప్యాలెస్ ఒకరోజు రెంట్ రెండు కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. పెళ్లికి వెళ్లిన వారి సౌకర్యాల కోసం, భోజన సదుపాయాలు, ప్యాలెస్ డెకరేషన్ కోసం దాదాపు మూడున్నర కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది . ఇక పెళ్లిలో నిహారిక ధరించిన నగల విలువ సుమారు మూడు కోట్ల వరకు ఉంటుందట.ఇలా  నిహారిక పెళ్లికి దాదాపుగా 50 కోట్ల వరకు నాగబాబు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుండ‌గా, ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...