Home Film News R Narayana Murthy: నటుడు ఆర్ నారాయణ మూర్తి పెళ్లి చేసుకోలేదు.. కారణం ఇదే.. !
Film News

R Narayana Murthy: నటుడు ఆర్ నారాయణ మూర్తి పెళ్లి చేసుకోలేదు.. కారణం ఇదే.. !

R Narayana Murthy: విప్లవానికి సంబంధించిన సినిమాలు తీస్తూ ప్రజల్లో చైతన్యం నింపే నటుడు ఆర్. నారాయణ మూర్తి. ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా వర్క్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కమ్యునిస్ట్ సినిమాలు తెరకెక్కిస్తూ విభిన్నంగా ఇమేజ్ ను దక్కించుకున్నారు. ఆయనకు ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఎలాంటి ఆర్బాటాలు లేకుండా మాములు వ్యక్తిగా ఉంటాడు. ఆర్. నారాయణ మూర్తి చాలా మంచివారని ఆయన్ను కలిసిన వారంతా చెప్తారు. చాలా సాదాసీదాగా ఉంటూ ఎంతో ఉన్నతంగా పదిమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఇప్పటికీ ఆయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు.

తనకు ఉన్న ఆస్తిని పేదలకు పంచుతూనే ఉంటారు. అలాంటి ఆర్. నారాయణ మూర్తి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. సినిమాలంటే ఎంతో ఇష్టం ఉండేది ఆర్. నారాయణమూర్తికి. ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎదిగారు. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా వ్యవహరించారు. ఎన్నో సినిమాలు విప్లవభావాలు, రైతుల పక్షాన ఉంటూ.. కార్మికలు, కర్తకులను ఆదరిస్తారు. ప్రతి సినిమాలో దోపిడి రాజకీయ వ్యాపారవేత్తలు పేద ప్రజల్ని అణచివేస్తారో ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఓ అమ్మాయిని చాలా సిన్సియర్ గా ప్రేమించారు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. ఇదే విషయం తన తల్లిదండ్రులకు చెబితే వాళ్లు అస్సలు ఒప్పుకోలేదట. ఆమెను గానీ మా అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంటే మేము సూసైడ్ చేసుకుంటామని బెదిరించారట. అందుకే అప్పట్నుండి ఇంట్లో వాళ్లని బాధపెట్టలేక.. ఆ అమ్మాయిని మర్చిపోలేక.. ఇక తన జీవితంలోనే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయి.. అలాగే ఉండిపోయారు. అందుకే ఆర్. నారాయణ మూర్తి పెళ్లికి దూరంగా.. సమాజసేవకు దగ్గరకగా ఉండిపోయారు. అందుకే ఇప్పటికే ఈ విషయాన్ని ఓ ఇంటర్యూలో చెప్పారు. ఇప్పటికీ ఆయన దగ్గరకు ఎవరైనా సాయం కోరి వస్తే.. తాను చేయగలిగినది చేస్తారట.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...