Home Film News Rashmika: డిసెంబ‌ర్ నెల అంటే ప‌డి చ‌చ్చిపోతున్న ర‌ష్మిక‌.. ఆమెకి అంత స్పెష‌ల్ ఏంటి?
Film News

Rashmika: డిసెంబ‌ర్ నెల అంటే ప‌డి చ‌చ్చిపోతున్న ర‌ష్మిక‌.. ఆమెకి అంత స్పెష‌ల్ ఏంటి?

Rashmika: ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించిన క‌న్న‌డ క‌స్తూరి జెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ నేష‌న‌ల్ క్ర‌ష్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమా త‌ర్వాత ఈ అమ్మ‌డు టాలీవుడ్‌, బాలీవుడ్‌ల‌లో త‌న హంగామా చూపిస్తుంది. ఒక‌వైపు సినిమాలు, మ‌రోవైపు గ్లామర్ షోతో అంద‌రి అటెన్ష‌న్ త‌న‌పై ప‌డేలా చేస్తుంది ర‌ష్మిక‌. అయితే ఎప్ప‌టి నుండో బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్న ఈబ్యూటీ… పుష్ప చిత్రం త‌ర్వాత  ఏకంగా మూడు హిందీ సినిమాలు చేసింది. ఇప్పుడు  నాలుగు సినిమాల వరకూ ఆమె చేతిలో ఉన్నట్టు తెలుస్తుంది. మ‌రోవైపు అల్లు అర్జున్ స‌ర‌స‌న పుష్ప 2 అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాపై ర‌ష్మిక‌కి బోలెడ‌న్ని అంచ‌నాలు ఉన్నాయి. అయితే త‌న‌కి అన్ని నెల‌ల కన్నా కూడా డిసెంబ‌ర్ నెల చాలా ఇష్ట‌మ‌ని చెబుతుంది ర‌ష్మిక‌. అందుకు కార‌ణం కూడా చెప్పుకొచ్చింది.

సినిమా వాళ్లకి సెంటిమెంట్స్ చాలా ఎక్కువే ఉంటాయి.  ఫ‌లానా హీరో లేదా హీరోయిన్‌ లేదంటే ఫ‌లానా ఆర్టిస్టు లు ఉంటే సినిమా ఖ‌చ్చితంగా ఆడుతుంద‌ని న‌మ్మ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి అవి నిజం కూడా కావ‌డంతో ఆ సెంటిమెంట్స్‌కి స్టిక్ అయి ఉంటున్నారు. ర‌ష్మిక విష‌యానికి వ‌స్తే ఈ అమ్మ‌డు డిసెంబ‌ర్ నెల‌ని త‌న సెంటిమెంట్‌గా భావిస్తుంది.   వ్యక్తిగతంగా, వృత్తిపరంగా డిసెంబ‌ర్  నెలని నేను  సెంటిమెంట్‌గా.. లక్కీ మంత్‌గా భావిస్తాను అని చెప్పుకొచ్చింది. నా తొలి చిత్రం  ‘కిరిక్‌ పార్టీ’ డిసెంబర్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ సాధించింది. ఇక నేను నటించిన మ‌రో నాలుగు చిత్రాలు కూడా అదే నెలలో విడుదలై సక్సెస్‌ అయ్యాయి. ఇక నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ‘పుష్ప’ కూడా డిసెంబరులోనే రిలీజై అద్భుత విజ‌యం అందించింది

నేను నటిస్తున్న ‘యానిమల్‌’ అనే బాలీవుడ్  చిత్రం త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంటుంద‌ని ర‌ష్మిక భావిస్తుంది. చిత్రంలో త‌న  పాత్రను ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి అని అంటుంది ర‌ష్మిక‌. ఇది ఎంతో కష్టతరమైన పాత్ర. ఇప్పటి వరకు నా కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదు అని చెబుతుంది ర‌ష్మిక‌. మ‌రి కొద్ది రోజులుగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌తమతం అవుతున్న ర‌ష్మిక‌కి ఈ చిత్రం అయిన మంచి హిట్ అందించాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...