Home Film News Brahmanandam Son: బ్ర‌హ్మానందం కొడుకు సినిమాల‌లోకి రాక‌పోయిన అంత‌గా సంపాదిస్తున్నాడా..!
Film News

Brahmanandam Son: బ్ర‌హ్మానందం కొడుకు సినిమాల‌లోకి రాక‌పోయిన అంత‌గా సంపాదిస్తున్నాడా..!

Brahmanandam Son: కామెడీ బ్ర‌హ్మా బ్ర‌హ్మానందం పేరు తెలియ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని ద‌శాబ్ధాల పాటు త‌న కామెడీతో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించిన బ్ర‌హ్మానందం ఇటీవ‌ల కాస్త స్పీడ్ త‌గ్గించారు. అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో క‌నిపిస్తూ మెప్పిస్తున్నారు. అయితే బ్ర‌హ్మానందం అంత పెద్ద స్టార్ క‌మెడీయిన్ అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పిల్ల‌ల‌ని మాత్రం ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకునేలా చేయ‌లేక‌పోయాడు.  బ్రహ్మానందం పెద్ద అబ్బాయి రాజా గౌతమ్ కన్నెగంటి ‘పల్లకిలో పెళ్లి కూతురు’ అనే చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఈ సినిమా ప‌ర్వాలేదు అనిపించిన త‌ర్వాత వ‌చ్చిన చిత్రాలు బాగా నిరాశ‌ప‌రిచాయి.  దాంతో సినిమాలు చేయ‌డం మానేసి వ్యాపారంపై దృష్టి పెట్టాడు.

బ్ర‌హ్మీ త‌న‌యుడు గౌతమ్ బిజినెస్, ఆయ‌న ఇన్‌కమ్ గురించి తెలిసిన జనాలు షాక్ అవుతున్నారు. గౌత‌మ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేయ‌గా, ఆయ‌న  పలు ఎమ్ఎంసీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడట.  అలానే బెంగుళూరులో రెస్టారెంట్స్  కూడా ఉన్నాయట. ఆయ‌న‌కి ప‌లు కమర్షియల్ కాంప్లెక్స్ లు కూడా ఉన్నాయ‌ని తెలుస్తుంది. పలు వ్యాపారాల ద్వారా గౌతమ్ నెలకు రూ. 30 కోట్లు వరకు సంపాదిస్తాడని అంటున్నారు. రోజు ప్ర‌కారం చూస్తే అత‌ను కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు. అత‌ని సంపాద‌న గురించి తెలుసుకున్న నెటిజ‌న్స్ నీ నెల సంపాద‌న‌తో మంచి సినిమానే తీయోచ్చు అని ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బ్ర‌హ్మానందం కూడా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే బాగానే సంపాదించాడు. మూడు దశాబ్దాలకు పైగా బ్ర‌హ్మానందం తీరిక లేకుండా నటించారు. ఇక ఆయ‌న‌ సంపాదించిన ప్రతి రూపాయి  కూడా జాగ్రత్త చేశారు. డబ్బులు విషయంలో  బ్రహ్మానందం కచ్చితంగా ఉంటారు. ఇష్ట‌మొచ్చిన‌ట్టుఖర్చు చేయడం, ఆర్భాటాల కోసం దానాలు చేయడం ఆయనకు నచ్చదు. బ్రహ్మానందంకి వందల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తుండ‌గా,  ఆ సంపదను రాజా గౌతమ్ వ్యాపారాల వైపు మళ్ళించి లాభాలు పొందుతున్నాడ‌ని టాక్. ఇక‌ బ్రహ్మానందం చిన్న కొడుకు విష‌యానికి వ‌స్తే ఇటీవ‌లే అత‌ని పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ప్ర‌స్తుతం విదేశాల‌లో ఆయ‌న ఉద్యోగం చేస్తున్న‌ట్టు టాక్.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...