Home Film News Divorce: విడాకుల‌కి సిద్ధ‌మైన మ‌రో సెల‌బ్రిటీ జంట‌..పెళ్లైన ఏడాదికేనా..!
Film News

Divorce: విడాకుల‌కి సిద్ధ‌మైన మ‌రో సెల‌బ్రిటీ జంట‌..పెళ్లైన ఏడాదికేనా..!

Divorce: ఒక‌ప్పుడు విడాకులు అనే ప‌దం ఎక్కువ‌గా వినిపించేదే కాదు. కాని ఇప్పుడు మాత్రం మారుమ్రోగిపోతుంది. ఎంతో అట్ట‌హాసంగా పెళ్లిళ్లు చేసుకున్న జంట‌లు ప‌ట్టుమ‌ని ప‌ది కాలాలు కూడా క‌లిసి ఉండ‌డం లేదు. పెళ్లైన మూడు నాలుగేళ్ల‌కే విడాకులు తీసుకుంటున్నారు. ఒక‌ప్పుడు ఎన్ని ఇబ్బందులు వ‌చ్చిన  సరే.. బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. చిన్న విష‌యంలో తేడా వ‌చ్చిన విడాకులు అనేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో స‌మంత నాగ చైత‌న్య విడాకుల విష‌యం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో మనం చూశాం.వీరి త‌ర్వాత అమీర్ ఖాన్, ధ‌నుష్ వంటి స్టార్ హీరోలు కూడా విడాకుల బాట ప‌ట్టారు. ఇక మెగా ఫ్యామిలీలో అయితే శ్రీజ‌, నిహారిక కూడా విడాకులు తీసుకున్నార‌ని తెలుస్తుంది.

ఇక తాజాగా జబర్దస్త్‌ జంటకు సంబంధించిన విడాకుల విష‌యం హాట్ టాపిక్ అవుతుంది. బుల్లితెర క‌మెడీయన్ యాద‌మ్మ రాజు  ప‌లు కామెడీషోల‌లోన‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టెల్లాతో క‌లిసి మ‌నోడు యూట్యూబ్‌లో అనేక వీడియోలు చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ఏర్ప‌డింది. ఇక గత సంవ‌త్స‌రం పెద్ద‌ల‌ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరు ఇప్ప‌టికీ కలిసే టీవీ షోలు చేస్తున్నారు. అయితే స‌డెన్‌గా వారు విడిపోతున్నార‌నే వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. పెళ్లైన ఏడాదికే విడాకులా అంటూ కొంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

అయితే వీరు విడాకులు తీసుకునేది రీల్ లైఫ్‌లో, రియ‌ల్ లైఫ్‌లో కాదులేండి. కామెడీ షో  జబర్దస్త్‌లో కమెడియన్లు.. ప్రతి వారం ఓ వెరైటీ థీమ్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ వారం యాదమ్మ రాజు, స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్లు ఓ స్కిట్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా,  ఇందులో నీతో నావల్ల కావడం లేదు. నాకు విడాకులు కావాలి’ అని స్టెల్లా అడుగుతుంది. ఆ విడాకులు కూడా ఓ ఫంక్షన్‌లా జరగాలని చెబుతుంది. ఈ ప్రొమో చూసిన ప్రేక్షకులు మండి పడుతున్నారు. షోల‌ కోసం ఇన్నాళ్లు పెళ్లిల్లు చేశారు.. ఇప్పుడు విడాకులు కూడానా.. టీఆర్పీ కోసం మ‌రీ ఇంత  దిగజారతారా అంటూ ఓ రేంజ్‌లో మండి పడుతున్నారు

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...