Krishnamma
Krishnamma Teaser: కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ స్టోరీస్, పర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రామిసింగ్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ ఇప్పుడు ‘కృష్ణమ్మ’ అనే మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో.. వి.వి. గోపాల కృష్ణ దర్శకత్వంలో.. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. అథీరా రాజీ కథానాయిక. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటూ మూవీ మీద అంచనాలు పెంచిందీ టీజర్.
సత్య దేవ్ ఈసారి కంప్లీట్ మాస్ అవతార్‌లో అగ్రెసివ్ క్యారెక్టర్‌లో అలరించనున్నాడు. టీజర్‌లో రెండు చోట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ ‘సింహాద్రి’ పోస్టర్స్ అండ్ ఫ్లెక్సీలు కనిపించాయి. సత్య దేవ్, తారక్ అభిమానిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
‘‘ఈ కృష్ణమ్మాలాగే మేము.. ఎప్పుడు పుట్టామో, ఎలా పుట్టామో ఎవ్వడికీ తెలీదు.. ఎప్పుడు పుట్టినా, ఎలా పుట్టినా.. పుట్టిన ప్రతివాడికి ఏదో కథ ఉండే ఉంటది.. కథ నడక, నది నడత ప్రశాంతంగా సాగిపోవాలంటే.. ఎవ్వడూ కెలక్కూడదు.. కానీ, కెలికారు’.. అంటూ క్లుప్తంగా కథ చెప్పారు. విజయవాడ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘కృష్ణమ్మ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సన్నీ కూరపాటి విజువల్స్, కాల భైరవ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ సినిమాకి లిరిక్స్ : అనంత శ్రీరామ్, రైటర్ : సురేష్ బొబ్బా, ఎడిటింగ్ : తమ్మిరాజు, ఆర్ట్ : రామ్ కుమార్, ఫైట్స్ : పృథ్వీ శేఖర్..
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.