Home Film News Director: అంత పెద్ద డైరెక్ట‌ర్‌ని డైరెక్ట్‌గా మీరు గే క‌దా అని అడిగిన నెటిజ‌న్.. స‌మాధానం అదుర్స్
Film News

Director: అంత పెద్ద డైరెక్ట‌ర్‌ని డైరెక్ట్‌గా మీరు గే క‌దా అని అడిగిన నెటిజ‌న్.. స‌మాధానం అదుర్స్

Director: సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగాక అభిమానులు, సెలబ్రిటీల మధ్య దూరం చాలా తగ్గింది. ఒక‌ప్పుడు వారితో మాట్లాడాల‌న్నా, వారికి సంబంధించి ఏదైన విష‌యాలు తెలుసుకోవాల‌న్నా చాలా క‌ష్టంగా ఉండేది. కాని ఇప్పుడు సోష‌ల్ మీడియా వ‌ల‌న వారితో అన్ని విష‌యాలు మాట్లాడే అవ‌కాశం ద‌క్కింది. కాని దీనిని అంద‌రు సద్వినియోగం చేసుకోవ‌డం లేదు. సెల‌బ్రిటీల‌ని ఇబ్బంది పెట్టే ప్ర‌శ్న‌లు వేయడం, సెల‌బ్రిటీల‌పై త‌ప్పుడు ప్రచారాలు చేయ‌డం వంటివి చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శక నిర్మాత‌ని ఓ నెటిజన్ మీరు గే కదా అని డైరెక్ట్‌గా ప్ర‌శ్నించారు . దీనికి క‌ర‌ణ్ ఇచ్చిన స‌మాధానం అదిరిపోయింది.

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ర‌ణ్ జోహార్‌కి స్టార్ హీరోల‌ని మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న అద్భుతమైన సినిమాలు రూపొందించ‌డ‌మే కాకుండా  ప‌లు షోల‌ని హోస్ట్ కూడా చేశాడు. అయితే క‌ర‌ణ్ జోహార్ రీసెంట్‌ఘా థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో ఫ్యాన్స్ తో మాట్లాడాల‌ని భావించి  ‘ఆస్క్ కరణ్ ఎనీథింగ్’ సెషన్‌ను నిర్వ‌హించారు. ఇందులో కేవ‌లం తాను 10 నిమిషాల పాటు అందుబాటులో ఉంటాన‌ని మీకు న‌చ్చిన‌ ప్ర‌శ్న‌లు అడ‌గొచ్చున‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో ప‌లువురు నెటీజ‌న్లు ఆస‌క్తికర ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా, ఓ నెటీజ‌న్ వేసిన ప్ర‌శ్న మాత్రం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

‘మీరు గే క‌దా.. నిజ‌మేనా..?’ అంటూ క‌ర‌ణ్ జోహార్‌ని ఓ నెటిజ‌న్  ప్ర‌శ్నించాడు. దీనికి ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌కుండా త‌న‌దైన శైలిలో  స‌మాధానం ఇచ్చాడు. తాను గేనా కాదా అనే దానిపై స‌మాధానం ఇవ్వ‌కుండా  “నీకు ఇంట్రెస్ట్ ఉందా..?” అంటూ క‌ర‌ణ్ జోహార్ బ‌దులివ్వ‌డంతో అత‌డి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇప్పుడు  వీరి సంభాష‌ణ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ కాగా, నెటిజ‌న్స్ వాటిపై వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు. నిజంగా మీకు సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ.. అది ఇప్పుడు ప్రూవ్ అయిందంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.  ఇక ఇదిలా ఉంటే క‌రణ్ జోహార్  సరోగసీ పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన విష‌యం తెలిసిందే. కొడుకు పేరు యష్ కాగా కూతురు పేరు రూహి. ఆయ‌న‌ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? దాని కారణం ఏమిటి అనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...