Home Film News Madhavi Latha: బిగ్ బాస్ సీజ‌న్ 7 ఆఫ‌ర్ నిజ‌మే…మాధ‌వీ ల‌త కామెంట్స్ వైర‌ల్
Film News

Madhavi Latha: బిగ్ బాస్ సీజ‌న్ 7 ఆఫ‌ర్ నిజ‌మే…మాధ‌వీ ల‌త కామెంట్స్ వైర‌ల్

Madhavi Latha: మాధ‌వీ ల‌త అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కి వెంట‌నే స్ట్రైక్ కాక‌పోవ‌చ్చు. న‌చ్చావులే చిత్ర హీరోయిన్ అంటే మాత్రం వెంట‌నే గుర్తు పట్టేస్తారు. ఈ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్న మాధవీ ల‌త  స్నేహితుడా, అర‌వింద్ 2 వంటి చిత్రాల్లో న‌టించి  ఆ త‌ర్వాత ఆమె క్ర‌మంగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది. ఇప్పుడు రాజ‌కీయాలకి కూడా దూరంగానే ఉంటున్న‌ట్టు  తెలుస్తుంది. ఇక కొద్ది రోజులుగా ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 7లో అడుగుపెట్ట‌బోతుంద‌ని జోరుగా ప్ర‌చారాలు సాగాయి. దానిపై త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఎట్ట‌కేల‌కు స్పందించి మాధ‌వీ ల‌త‌.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాధ‌వీల‌త ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకి సంబంధించిన విష‌యాల‌పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. గ‌త కొద్ది రోజులుగా మాధ‌వీ ల‌త బిగ్ బాస్ సీజ‌న్ 7లోకి ఎంట్రీ ఇవ్వ‌నుందంటూ ప్ర‌చారాలు సాగాయి.  ఈ క్ర‌మంలో స్పందిచిన మాధ‌వీ ల‌త‌… బిగ్ బాస్ బృందం  మూడు సార్లు అఫీషియ‌ల్‌గా క‌లిసిన‌ట్లు చెప్పుకొచ్చింది. ఓ నెటిజ‌న్ బిగ్ బాస్ టీమ్.. మాధ‌వీ ల‌త‌ని స్ప‌దించిన‌ట్టుగా ఫోటోని క్రియేట్ చేయ‌గా, దానిని షేర్ చేసిన మాధ‌వీ ల‌త‌.. నా ఫాలోవ‌ర్స్ అంద‌రికి నేను ఒక  విష‌యం తెలియ‌జేయాల‌నుకుంటున్నాను.ఈ ఫోటోని ఎవ‌రు క్రియేట్ చేశారో నాకు తెలియ‌దు కాని ఇది నిజ‌మే.

బిగ్‌బాస్ సీజ‌న్ 7 కోసం వారు న‌న్ను సంప్ర‌దించారు.అయితే ఇది మొద‌టి సారు కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు వాళ్లు నాకు బిగ్‌బాస్ ఆఫ‌ర్ ఇచ్చిన కూడా నేను  సున్నితంగా తిర‌స్క‌రించాను.  నాకు ప‌ర్స‌న‌ల్‌గా బిగ్‌బాస్ షోలోకి వెళ్లాల‌ని లేదు. న‌న్ను బిగ్ బాస్ షోలో పాల్గొనాల‌ని వారు కోరినందుకు బిగ్‌బాస్ టీమ్‌కు చాలా పెద్ద థ్యాంక్స్ అంటూ మాధ‌వీ ల‌త త‌న పోస్ట్‌లో తెలియ‌జేసింది. ఇప్పుడు సినిమాలు కూడా మాధ‌వీల‌త‌కి పెద్ద‌గా లేదు. మ‌రి అలాంటి స‌మ‌యంలో ఇంత మంచి ఆఫర్ వ‌చ్చినందుకు మాధ‌వీ ల‌త ఎందుకు నో చెప్పింద‌నేది ఎవ‌రికి తెలియ‌డం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...