Home Film News Pawan Chiranjeevi: చేతులపై 22 కార్లు ఎక్కించుకున్న ప‌వ‌న్.. చిరంజీవి సెట్స్‌కి వెళ్లి అంద‌ర్నీ..
Film News

Pawan Chiranjeevi: చేతులపై 22 కార్లు ఎక్కించుకున్న ప‌వ‌న్.. చిరంజీవి సెట్స్‌కి వెళ్లి అంద‌ర్నీ..

Pawan Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోద‌రుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఇప్పుడు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారు ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్ర‌స్తుతం రాజ‌కీయాలతో పాటు సినిమాల‌తో బిజీగా ఉన్నారు ప‌వ‌న్. అయితే సినిమాల‌లో న‌టించాల‌నే ఆస‌క్తి లేని ప‌వ‌న్ మెల్ల‌గా సినిమాల‌లోకి వ‌చ్చి ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వచ్చిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కాగా,  1996లో విడుదలైన ఈ సినిమా మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమాలో న‌టించిన న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌పరిచారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారు. ఫ్రెష్‌గా ఉంటారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే చిరంజీవికి చాలా అభిమానం. ఇక తొలి సినిమాలో ప‌వ‌న్ త‌న చేతుల‌పై కార్లు పోనిచ్చుకోవ‌డం గురించి కూడా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తొలి సినిమాలో కార్లు చేతులపై పోనివ్వడం, బండరాళ్లు శరీరంపై పగలగొట్టుకోవడం లాంటి ఫీట్స్ పవన్ రియల్‌గా చేయడం చూసి తాను ఎంతో బాధ పడ్డాన‌ని అత‌ను తెలియ‌జేశాడు. ఈ సీన్ అప్పుడు చిరంజీవి గారు అక్క‌డే ఉన్నారు. వేళ్ల‌పై నుండి ఏకంగా 22 కార్లు వెళ్లాయి. కార్ల నుండి బ్ల‌డ్ వ‌స్తుంటే చిరంజీవి వ‌ద్దురా అన్నా కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ప‌న ప‌డి చేశారు.

కొవ్వొత్తులు క‌రిగి అత‌ని చేతుల‌పై ప‌డేది కూడా నిజం. ఒక డ్రాప్ ప‌డితేనే మ‌నం త‌ట్టుకోం. కాని ఆయ‌న భ‌రించాడు. చిరంజీవి గారు అవ‌న్నీ చూసి చాలా బాధ‌ప‌డ్డారు. మేం కూడా చాలా బాధ‌ప‌డ్డాం అని తెలియ‌జేశారు.ఇక అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైన సుప్రియ కూడా ఓ సంద‌ర్భంలో ఈ కార్ల సీన్  గురించి చెప్పుకొచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న  చేతుల మీదికి కార్లు ఎక్కించుకునే సన్నివేశం మా అంద‌రికి కన్నీళ్లు తెప్పించిందని చెప్పింది. ప‌వన్ త‌న  చేతులపై కార్లు ఎక్కించుకునే సీన్ అన్నపుడు డూప్ను పెట్టి లేదా – కెమెరా ట్రిక్ తో మేనేజ్ చేస్తారేమో అని నేను భావించాను. కానీ నిజంగా కార్లు రావ‌డం, ఒక దాని తర్వాత మరొకటి చేతులపై ఎక్క‌డం చూసి  నాకు కన్నీళ్లు ఆగలేదు అని సుప్రియ పేర్కొంది. అంత త‌ప‌న ఉన్న‌ది కాబ‌ట్టి ఈ రోజు అంత పెద్ద హీరో అయ్యాడ‌ని ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...