Home Film News Samantha: నాగ చైతన్య క‌న్నా ముందు స‌మంత ఎవ‌రి ప్రేమ‌లో ఉంది.. అతనితో బ్రేక‌ప్ కార‌ణ‌మేంటి?
Film News

Samantha: నాగ చైతన్య క‌న్నా ముందు స‌మంత ఎవ‌రి ప్రేమ‌లో ఉంది.. అతనితో బ్రేక‌ప్ కార‌ణ‌మేంటి?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు బాలీవుడ్ స్థాయిలో కూడా అద‌ర‌గొడుతుంది. ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్ష‌కుల‌ని కూడా అల‌రించింది. ఇప్పుడు సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. అయితే స‌మంత కెరీర్  స‌జావుగానే సాగుతున్న‌ప్ప‌టికీ ఆమె ప‌ర్స‌న‌ల్ లైఫ్ చాలా డిస్ట్ర‌బ్‌గా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌కి విడాకులు ఇచ్చిన ఈ భామ ఇటీవ‌ల మ‌యోసైటిస్ అనే భ‌యంక‌ర వ్యాధి బారిన కూడా ప‌డింది. ఇప్పుడు పూర్తిగా కోలుకుంద‌నుకోండి. కాక‌పోతే చైతూతో విడాకులు ఆమెని తీవ్రంగా ఇబ్బందుల‌కి గురి చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. చూడ‌ముచ్చ‌ట‌గా ఉండే ఈ జంట విడిపోవ‌డం అభిమానుల‌కి కూడా ఏ మాత్రం రుచించ‌డం లేదు.

అయితే స‌మంత‌.. నాగ చైత‌న్య క‌న్నా ముందు సిద్ధార్థ్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌నే విష‌యం అతికొద్ది మందికే తెలుసు.స‌మంత, సిద్ధార్థ్ క‌లిసి జబర్దస్త్ అనే సినిమాలో న‌టించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్ద‌రు క్లోజ్ కాగా, త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ్డారుట‌. ఓ సారి ఈ ఇద్దరూ కలిసి శ్రీకాళహస్తిలో రాహు కేతు పూజలు చేయడం   చూసి పెళ్లి చేసుకుంటారేమో అని అంద‌రు అనుకున్నారు. కాని ఏమైందో ఏమి అనూహ్యంగా విడిపోయారు. ఆ త‌ర్వాత స‌మంత‌.. నాగ చైత‌న్య‌కి ద‌గ్గ‌ర కావ‌డం ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగింది. పెళ్లైన నాలుగేళ్ల‌కే వీరిద్ద‌రు విడిపోవ‌డం ఇండ‌స్ట్రీలోను, బ‌య‌ట కూడా హాట్ టాపిక్ అయింది.

ఇక ప్ర‌స్తుతం నాగ చైత‌న్య‌, స‌మంత ఎవరి ప‌నుల‌తో వారు బిజీగా ఉన్నారు. స‌మంత టాలీవుడ్‌లోనే కాక బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తుంది. హాలీవుడ్‌లోను ఓ సినిమా చేయ‌నుంద‌ని అంటున్నారు. ఇక నాగ చైత‌న్య విష‌యానికి వ‌స్తే మ‌నోడు హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవ‌లి కాలంలో నాగ చైత‌న్య‌కి ఒక్క మంచి హిట్ కూడా రాలేదు. చివరిగా క‌స్ట‌డీ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం కూడా తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చింది.స‌మంత‌, నాగ చైతన్య కాంబినేష‌న్‌లో నందిని రెడ్డి ఓ సినిమా చేయ‌నుంద‌ని కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు..

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...