Home Film News Balayya Marriage-NTR: ఎన్టీఆర్ లేకుండానే జ‌రిగిన బాల‌కృష్ణ పెళ్లి.. సొంత కొడుకు పెళ్లికి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం?
Film News

Balayya Marriage-NTR: ఎన్టీఆర్ లేకుండానే జ‌రిగిన బాల‌కృష్ణ పెళ్లి.. సొంత కొడుకు పెళ్లికి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం?

Balayya Marriage-NTR: విశ్వ విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నందమూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కేవ‌లం మహానటుడిగానే కాకుండా మహానాయకుడిగా కూడా ఎంతో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఎన్టీఆర్ త‌న కెరీర్‌లో పోషించ‌ని పాత్ర‌లు లేవు. ఇక రాజ‌కీయాల‌లోకి వ‌చ్చాక ప్ర‌జ‌లకి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటూ వారికి ఎన్నో సేవ‌లు చేశారు. తెలుగు ప్రజల శ్రేయస్సు ఆకాంక్షించి తెలుగుదేశం పార్టీని  స్థాపించి ప్రజా సేవకి సమర శంఖం పూరించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా కాకుండా తెలుగు వారి సేవకుడిగా ఆయ‌న పని చేశారు. చాలా సంద‌ర్భాల‌లో ఆయ‌న తన సొంత కుటుంబం కంటే ప్రజా సేవ‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే ఆయ‌న ప్ర‌జ‌ల మ‌న‌సుల‌లో దేవుడిగా నిలిచిపోయారు.

ఎన్టీఆర్‌కి బాల‌కృష్ణ అంటే అమిత‌మైన ప్రేమ ఉండేది. ఇద్ద‌రు క‌లిసి ప‌లు సినిమాల‌లో కూడా న‌టించారు. అయితే బాల‌కృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ గైర్హాజ‌రు కావ‌డంతో త‌న తండ్రి లేకుండా ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవ‌ల‌సి వ‌చ్చింది. వివ‌రాల‌లోకి వెళితే అన్న‌గారు ఎల‌క్ష‌న్స్‌లో తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు ప్ర‌జా యాత్ర పేరుతో రాష్ట్రమంతటా ఎన్టీఆర్ కాంపెయిన్ చేస్తూ ప్ర‌జ‌ల సమ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. అయితే అదే  సమయంలో బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ మ‌రో కొడుకు రామకృష్ణ పెళ్లి జరిగింది.ఇద్దరి కొడుకుల పెళ్లిళ్లు తిరుప‌తిలో ఒకే రోజు జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ కూడా ఎన్టీఆర్ రాలేదు.

పెళ్లికి వెళితే మ‌ళ్లీ యాత్ర‌కి విరామం ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని భావించిన ఎన్టీఆర్ వెళ్ల‌డం మానేశార‌ట‌. సొంత కుటుంబ స‌భ్యుల క‌న్నా కూడా ఆయ‌న ప్ర‌జా సేవ కోసమే ఎక్కువ‌గా ప‌రితపించారు. అయితే  ఎన్టీఆర్ రాలేని పరిస్థితి నెల‌కొన్న నేప‌థ్యంలో తిరుపతిలో  పెళ్లి చేసుకున్న బాలకృష్ణ, రామకృష్ణ.. యాత్రలో ఉన్న ఎన్టీఆర్ దగ్గరకి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారట. ఈ వివరాల‌ని ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో సీనియ‌ర్ నటుడు మురళీ మోహన్ తెలియజేశాడు. అయితే బాల‌కృష్ణ‌.. చెన్నైకి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకున్న ఎన్టీఆర్.. కాకినాడకి చెందిన నాదెళ్ల బంధువుల అమ్మాయి అయిన వసుంధరని వివాహం జ‌రిపించార‌ట‌.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...