Home Film News Venu: బ‌ల‌గంతో హిట్ కొట్టిన వేణు ఇన్నాళ్ల‌కి మ‌ళ్లీ మ‌రో సినిమా మొద‌లు పెట్టాడా..!
Film News

Venu: బ‌ల‌గంతో హిట్ కొట్టిన వేణు ఇన్నాళ్ల‌కి మ‌ళ్లీ మ‌రో సినిమా మొద‌లు పెట్టాడా..!

Venu: కొద్ది నెల‌ల క్రితం సైలెంట్‌గా వ‌చ్చి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం బ‌ల‌గం.ఈ చిత్రానికి తెలుగు ప్రేక్ష‌కులు ప‌ట్టం క‌ట్టారు. మూవీకి అపూర్వ విజయాన్ని అందించారు. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామా ప్ర‌తి ఒక్క‌రిని కూడా ఎంతగానో అల‌రించింది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి పెద్ద విజ‌యం అందుకుంది. బ‌ల‌గం చిత్రం ఎమోషనల్‌గా ఇటు కమర్షియల్‌గా కూడా మంచి స‌క్సెస్ అందుకుంది. ఇక ఈ చిత్రంలో . ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ తో పాటు ప్ర‌తి ఒక్క‌రు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచారు. అయితే ఇంత మంచి సినిమా తీసినందుకు వేణుపై ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపించారు.

తొలి  సినిమాతోనే డైరెక్టర్‌ గా  మంచి  బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వేణు.. రెండో సినిమా ఎప్పుడు చేస్తాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఇప్పుడు వేణు త‌న సెంకండ్ మూవీ పనుల్లో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తుంది.  వేణు  తన త‌ర్వాతి సినిమాపై   అప్‌డేట్ సోష‌ల్ మీడియా ద్వారా ఇచ్చారు. తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని ప్రారంభించినట్లు తెలియ‌జేశారు. మొద‌టి సినిమా ఎమోష‌న్‌తోనే అంద‌రి ప్ర‌శంస‌లు అందుకోవ‌డంతో   తన రెండో సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ఉండేలా వేణు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ఇక వేణు ఇచ్చిన అప్‌డేట్‌తో నెటిజ‌న్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.  బలగం మాదిరిగానే ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని  నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే హీరో నాని రీసెంట్‌గా బ‌ల‌గం సినిమా చూసి చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇన్నాళ్లు త‌న సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న నాని ఇప్పుడు కాస్త వీలు చూసుకొని సినిమా చూశారు. బ‌ల‌గం సినిమా నేను  ఆలస్యంగా ‘బలగం చూశానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ పెట్టాడు. ఇది కదా మ‌న‌ తెలుగు సినిమా ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఇదే క‌దా. వేణు, దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ సహా ఈ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. మీరు ఈ సినిమాలో నటించలేదు జీవించేశారు అంటూ నాని త‌న ట్వీట్‌లో రాసుకొచ్చాడు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...