Home Film News Brahmastra Trailer : విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూశారా..
Film News

Brahmastra Trailer : విజువల్ వండర్ ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూశారా..

Brahmastra Trailer
Brahmastra Trailer

Brahmastra Trailer: కింగ్ నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, బాలీవుడ్ యంగ్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ ఫిలిం ‘బ్రహ్మాస్త్ర’..

బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దీన్ని మూడు సినిమాల ఫ్రాంచైజీగా తెరకెక్కిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చెయ్యనున్నారు.

తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘బ్రహ్మాస్త్ర – మొదటి భాగం : శివ’ ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చారు. బుధవారం అన్ని భాషల్లో ట్రైలర్ రిలీజ్ చేశారు.

ప్రమోషన్స్‌లో రాజమౌళి, అయాన్ ముఖర్జీ గురించి ఎందుకంత ఎక్కువగా చెప్పారా అనుకుంటే దానికి ‘బ్రహ్మాస్త్ర’ విజువల్స్ సమాధానం చెప్తాయి. సినిమా బ్యాక్ డ్రాప్‌తో, క్యారెక్టర్స్‌ని రివీల్ చేస్తూ.. అతీత శక్తులను వెండితెర మీద ఒక విజువల్ వండర్‌గా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.

తెలుగులో ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాటలు రాశారు. ‘‘మునుపెన్నడూ చూడని ప్రాచీన భారత అస్త్రాల ప్రపంచంలోకి అడుగుపెట్టండి.. ‘బ్రహ్మస్త్రం పార్ట్ 1 : శివ’ ని ఈ సెప్టెంబర్ 9న మీ అభిమాన థియేటర్లలో చూడండి’’ అంటూ నాగార్జున, రాజమౌళి, కరణ్ జోహార్‌తో సహా పలువురు మూవీ టీం మెంబర్స్, సినిమా ఇండస్ట్రీ వారు ట్రైలర్ షేర్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...