Home Film News Adipurush : ‘డార్లింగ్ ఫొటో ప్లీజ్’ అంటూ ఎగబడ్డ బాలీవుడ్ మీడియా..
Film News

Adipurush : ‘డార్లింగ్ ఫొటో ప్లీజ్’ అంటూ ఎగబడ్డ బాలీవుడ్ మీడియా..

Adipurush Team
Adipurush Team

Adipurush: ‘బాహుబలి’ సిరీస్ సినిమాలతో మన టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తర్వాత డార్లింగ్ చేస్తున్నవన్నీ కూడా పాన్ ఇండియా మూవీసే. ‘సలార్’ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆదిపురుష్’ షూట్ కంప్లీట్ చేసేశాడు.

నాగ్ అశ్విన్‌తో చేస్తున్న ‘ప్రాజెక్ట్ -K’ పాన్ వరల్డ్ రేంజ్ ఫిలిం అంటున్నారు. దాని తర్వాత ‘అర్జున్ రెడ్డి’ తో తెలుగులో, ‘కబీర్ సింగ్’ తో హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చెయ్యబోతున్నాడు.

ప్రభాస్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా.. అది నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. రీసెంట్‌గా ‘ఆదిపురుష్’ టీమ్.. బాంబేలోని డైరెక్టర్ ఓం రౌత్ ఇంట్లో కలిశారు. ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్‌లతో ఓం రౌత్ సినిమా గురించి చర్చించారు. డిస్కషన్ అనంతరం తీసిన ప్రభాస్ అండ్ టీం పిక్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

రామాయణం ఆధారంగా అత్యంత ప్రెస్టీజియస్‌గా, భారీ బడ్జెట్‌తో.. విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న సినిమా అత్యంత భారీ స్థాయిలో విడుదల కానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...