Home Film News Cobra : విక్రమ్ ‘కోబ్రా’ వచ్చేస్తోంది..
Film News

Cobra : విక్రమ్ ‘కోబ్రా’ వచ్చేస్తోంది..

Cobra
Cobra

Cobra: వెర్సటైల్ యాక్టర్ ‘చియాన్’ విక్రమ్ సినిమాల గురించి, చేసిన క్యారెక్టర్ల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం, పోషించే పాత్ర కోసం.. ఎంత కష్టమైనా సరే.. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా తననితాను మలుచుకుంటారు.

‘అపరిచితుడు’, ‘ఐ’, ‘ఇంకొక్కడు’ ఇలా తన కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారాయన. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న ఫిలిం ‘కోబ్రా’..

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఏడు డిఫరెంట్ గెటప్స్‌లో కనబడి సర్‌ప్రైజ్ చేసిన చియాన్.. సినిమాలో మరింత డిఫరెంట్‌గా ఇంతకుముందెన్నడూ కనిపించని సరికొత్త గెటప్స్‌లో కనిపించనున్నారు.

ఇప్పటివరకు విడుదల ఆలస్యమవుతూ వస్తున్న ‘కోబ్రా’ ఎట్టకేలకు ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. విక్రమ్ సరసన ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. ప్రముఖ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. AR రెహమాన్ సంగీతమందిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...